Salaar Postpone: సలార్ విడుదల వాయిదా.. అలా లీకైపోయిన మేటర్.. ఎందుకు పోస్ట్‌పోన్ చేశారో తెలిస్తే!
గతంలో కంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎక్కువగానే తెరకెక్కుతున్నాయి. అయినప్పటికీ అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ వరల్డ్ వైడ్ మూవీ లవర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో 'సలార్: సీజ్‌ఫైర్' ఒకటి.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ మూవీ వాయిదా పడినట్లు ఓ న్యూస్ లీకైంది. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

'సలార్'గా వస్తున్న ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీనే 'సలార్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.

రిలీజ్ అప్పుడే.. ప్రమోషన్స్: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న పవర్‌ఫుల్ మూవీ 'సలార్'ను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే షూట్ కంప్లీట్ చేశారు. ఇక, రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే టీజర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్‌కు ప్లాన్ చేస్తున్నారు.

బుకింగ్స్ ఓపెన్... భారీగానే: హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'సలార్' మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో అప్పుడే అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీ హాఫ్ మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపిస్తోంది.
సలార్ ఫిల్మ్ వాయిదా అని: పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీ రిలీజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్‌లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో ఈ సినిమా వాయిదా పడినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంటే ఈ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కావట్లేదు.
అలా లీక్ అయిన మేటర్: ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' మూవీ వాయిదా పడినట్లు స్పష్టం కావడానికి ఓవర్సీస్ టికెటింగ్ వెబ్‌సైట్లే కారణం అని తెలిసింది. నిన్నటి వరకూ ఈ సినిమా బుకింగ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా.. ఉన్నట్లుండి టికెట్ల అమ్మకాలను నిలిపివేశారని తెలిసింది. ఇప్పటికే ఓవర్సీస్ బయ్యర్లు థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం కూడా అందించారని టాక్.

ఆ సీన్స్ క్వాలిటీనే సమస్య: 'సలార్' మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిందన్న వార్త లీక్ అవడంతో పాటు దానికి సంబంధించిన కారణాలు కూడా బయటకు వచ్చాయి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌పై ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నాడట. కొన్ని షాట్లపై రీ వర్క్ జరుగుతుందని, దీనికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్లే వాయిదా వేశారని తెలుస్తోంది.

ప్రభాస్ కాలు కూడా రీజనే: మరో వర్గం సమాచారం ప్రకారం.. 'సలార్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టాలని ప్లాన్ చేశారట. దీన్ని షూట్ చేద్దాం అనుకున్న సమయంలోనే ప్రభాస్ మోకాలి సమస్య ఎక్కువైనట్లు తెలిసింది. ఇప్పుడు అతడిపై సాంగ్ షూట్ చేయడం కష్టంగా మారిందట. అందుకే సినిమాను వాయిదా వేశారని అంటున్నారు. ఈ మూవీ వాయిదాపై నేడో, రేపో ప్రకటన రాబోతుందని టాక్.


Click it and Unblock the Notifications











