Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే లీక్.. సలార్ నుంచి మరో ట్రైలర్
బడా ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు తెలుగులో హవాను చూపించిన అతడు.. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఈ చిత్రాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఫస్ట్ పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరుతో విడుదల చేయనున్నారు. ఇది డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని భావిస్తోంది.
'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7:19 గంటలకు విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్‌ను కూడా రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ విడుదలకు ఇంకా 20 రోజులు సమయం ఉంది. దీంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. దీన్ని డిసెంబర్ 2వ వారంలో తీసుకు వస్తారని తాజాగా తెలిసింది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని టాక్.
ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











