Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్.. సలార్ నుంచి రాబోతున్న సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
పెద్ద సినీ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే అదిరిపోయే చిత్రాలతో అలరించిన అతడు.. 'బాహుబలి' చిత్రంతో అతడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'సలార్' మూవీని చేస్తున్నాడు. దీన్ని 'కేజీఎఫ్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. అప్పటి నుంచి ఎన్నో బ్రేకులు తీసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఇలా ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'సలార్' మూవీ టీజర్‌కు సంబంధించి చాలా రోజుల నుంచి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్‌ను జూలై నెలలోనే విడుదల చేయబోతున్నారట. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో దీని ద్వారా ప్రమోషన్‌ను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 'ఆదిపురుష్' ఫీవర్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఖాయం అని తెలియడంతో వాళ్లలో జోష్ రెట్టింపు అవుతోంది.

'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











