Salaar Trailer: సలార్ ట్రైలర్‌ డేట్ వచ్చేసింది.. యుద్ధ వీరుడిలా ప్రభాస్ అరాచకం

తెలుగు సినిమాలతో స్టార్లుగా ఎదిగిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, టాలీవుడ్ స్టామినాను చాటి చెప్పిన వాళ్లు మాత్రం కొంత మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతూనే ఉన్నాడు.

ఈ మధ్య కాలంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టుల్లోనే నటిస్తున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు.

Prabhas Starrer Salaar Movie Trailer Release Date and Time Announced

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన టాకీ పార్టును చిత్ర యూనిట్ ఇటీవలే విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ 'సలార్: సీజ్‌ఫైర్‌' పేరుతో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను వదిలారు.

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఈ సినిమా డిసెంబర్ 22కు వాయిదా పడింది. దీంతో ముందే రిలీజ్ చేయాలనుకున్న ట్రైలర్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దీన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7:19 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం తాజాగా వదిలింది. ఇందులో ప్రభాస్ చేతిలో గన్‌ పట్టుకుని యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఒకేసారి కొత్త పోస్టర్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X