Salaar Trailer: సలార్ ట్రైలర్‌ డీటేల్స్ లీక్.. ఏం ప్లాన్ చేశారు గురూ!

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువగా కనీసం ఒక ఫుల్ ఏడాది అయినా సమయం పడుతుంది. కానీ, టాలీవుడ్‌లోని కొందరు మాత్రం ఏకధాటిగా మూవీలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు పాన్ ఇండియా స్టార్ అయినా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' ఒకటి.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమానే 'సలార్'. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఇటీవలే దీనికి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ 'సలార్: సీజ్‌ఫైర్‌' పేరుతో విడుదల కాబోతుంది.

Prabhas Starrer Salaar Movie Trailer Release on December 1st

వాస్తవానికి 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఈ సినిమా డిసెంబర్ 22కు వాయిదా పడింది. దీంతో ముందే రిలీజ్ చేయాలనుకున్న ట్రైలర్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇది త్వరలోనే విడుదల కాబోతుంది అని చెబుతూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం... 'సలార్: సీజ్‌ఫైర్‌' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని యూనిట్ ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతుందని అంటున్నారు. అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. దాదాపు 20 రోజుల పాటు 'సలార్' పేరు మారుమ్రోగిపోయేలా చిత్ర యూనిట్ ప్రమోట్ చేయబోతుందని తెలుస్తోంది.

Prabhas Starrer Salaar Movie Trailer Release on December 1st

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X