తండ్రి లేని యువ హీరోకు మరోసారి అండగా ప్రభాస్.. మరో న్యూ ప్లాన్!
ప్రభాస్ కనిపించగానే అందరూ డార్లింగ్ అనేస్తుంటారు. అందుకు కారణం సినిమా వల్ల కాదు. ప్రభాస్ కు మంచి మనసు ఉండడం వల్లే చాలా మంది రెబల్ స్టార్ కు డార్లింగ్స్ అవుతుంటారు. అందుకు కారణం కూడా ఉంది. కొందరు రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సహాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు.
ప్రభాస్ కి ఎవరైనా నచ్చితే అంత ఈజీగా వదిలిపెట్టడని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన విషయం. ఇక ఎప్పుడో తనకు ఒక సినిమా ద్వారా హిట్టిచ్చిన దర్శకుడితో కూడా ప్రభాస్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆయన మరణం తరువాత ప్రభాస్ అతని కొడుకు బాధ్యతను తీసుకున్నాడు.
వాలంటైన్ రోజున ప్రియుడితో పెర్లీ ఫుల్ రొమాన్స్.. తన్మయత్వంలో మునిగిన ప్రేమ జంట

ఆ సినిమాతో భారీ క్రేజ్
మొదట ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలతో సక్సెస్ కొట్టాలని అనుకున్న ప్రభాస్ కు పెద్దగా విజయం దక్కలేదు. మొదటి సక్సెస్ రాలేదని ఆ సమయంలో ఎలాగైనా బలమైన బాక్సాఫీస్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూసిన ప్రభాస్ కి వర్షం సినిమా ద్వారా బ్రేక్ వచ్చింది. ఆ సినిమాతోనే దర్శకుడు శోభన్ ప్రభాస్ కి చాలా క్లోజ్ అయ్యాడు. మళ్ళీ వారి కాంబినేషన్ లో సినిమా రానుందని అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చాయి.

వర్షం దర్శకుడు మరణించడంతో..
వర్షం సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే ఆ సినిమా దర్శకుడంటే ప్రభాస్ అమితంగా ఇష్టపడతారు. ఇక శోభన్ తో మరోసారి కలిసి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఇక 2008లోనే శోభన్ గుండెపోటుతో మరణించాడు. అనంతరం ఆయన కొడుకు కోసం ఏదైనా చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.

అతనికి అండగా ప్రభాస్..
శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పటికే కొన్ని సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కి కాస్త దగ్గరయ్యాడు. తను నేను, పేపర్ బాయ్ వంటి సినిమాల్లో నటించిన సంతోష్ పెద్దగా క్లిక్కవ్వలేదు. అప్పట్లో ప్రభాస్ ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేశాడు కూడా. ఇక తన హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా ఆఫర్ ఇప్పించాడు ప్రభాస్.

ప్రమోషన్ లో ప్రభాస్
సంతోష్ కోసం ఎలాగైనా సరే మంచి సినిమాలతో కెరీర్ సెట్ అయ్యేలా చేయాలని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ తో చాలా సార్లు చర్చలు జరిపారు. ఇక ఫైనల్ గా ఒక సినిమానైతే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్ స్టోరీలో సంతోష్ హీరోగా నటించాడు. ఇక సినిమా ప్రమోషన్ విషయంలో ప్రభాస్ కూడా హ్యాండ్ వెయ్యబోతున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్రభాస్ టీమ్ స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్ కోసం కూడా..
ప్రభాస్ తోనే కాకుండా యూవీ క్రియేషన్స్ బయట హీరోలతో కూడా వర్క్ చేయడానికి సిద్ధమవుతోంది. ఎక్కువగా ప్రభాస్ ఆలోచన మేరకు ఇతర హీరోలకు అవకాశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్, మారుతి సినిమా సెట్టవ్వడానికి కారణం కూడా ప్రభాస్ అనే తెలుస్తోంది. ఇప్పుడు సంతోష్ శోభన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చేలా రెండు సినిమాలను ప్లాన్ చేయాలని తన హోమ్ బ్యానర్ కి డార్లింగ్ సజెస్ట్ చేశాడు. దీంతో యూవీ క్రియేషన్స్ కూడా ఆ యంగ్ హీరోకి సెట్టయ్యే విదంగా కథలను రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











