ప్రభాస్ అండతో మరో మెట్టు ఎక్కుతున్న జాతిరత్నం.. అది క్లిక్కయితే లైఫ్ సెట్టయినట్లే

నటుడిగా స్థిరపడాలని గత పదేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో సెట్టయ్యాడు. అతని టాలెంట్ ఏమిటో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి తెలుస్తోంది. అయితే జాతిరత్నాలు సినిమా కంటే ముందే కొంతమంది నవీన్ పొలిశెట్టి టాలెంట్ ను గుర్తించారు. అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు. నవీన్ కు ఒక బిగ్ ఆఫర్ రావడానికి ముఖ్య కారణం ప్రభాస్ అని తెలుస్తోంది.

షర్ట్ విప్పేసి అందాల విందు.. సాక్షి అగర్వాల్ రచ్చ

అంత ఈజీగా వదిలి పెట్టడు

అంత ఈజీగా వదిలి పెట్టడు

డార్లింగ్ ప్రభాస్ కు ఎవరైనా నచ్చితే అంత ఈజీగా వదిలి పెట్టడు. టెక్నీషియన్స్ కైనా నటీనటులకైనా తనవంతు సహాయం చేస్తుంటాడు. కేవలం ఆర్థికంగానే కాకుండా కెరీర్ కు ఉపయోగపడే విధంగా సలహాలు ఇస్తుంటారు. ఇక దాదాపు తన హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి యూవీ క్రియేషన్స్ లోనే చాలా మందికి లైఫ్ ఇచ్చాడు.

బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న శామా సికందెర్

అపజయాల్లో ఉన్న సమయంలో

అపజయాల్లో ఉన్న సమయంలో

ప్రభాస్ సలహాలు కూడా ఆ ప్రొడక్షన్ హౌజ్ కు చాలా సార్లు ఉపయోగపడ్డాయి. తన మిత్రుడైన గోపిచంద్ అపజయాల్లో ఉన్న సమయంలో జిల్ సినిమాతో ఛాన్స్ ఇచ్చి మంచి బూస్ట్ ఇచ్చాడు. ఇక వర్షం డైరెక్టర్ శోభన్ మరణించిన తరువాత అతని కొడుకు బాధ్యతను తీసుకున్న డార్లింగ్ అతనికి హీరోగా ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాడు.

అందుకు కారణం ప్రభాస్

అందుకు కారణం ప్రభాస్

ఇక నవీన్ పొలిశెట్టికి కూడా యూవీ క్రియేషన్స్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది. అందుకు కారణం కూడా ప్రభాస్ అని తెలుస్తోంది. హిందీలో చిచోరే సినిమా చూసిన అనంతరం ప్రభాస్ అందులో నవీన్ చేసిన యాసిడ్ క్యారెక్టర్ కు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు.

ప్రభాస్ సలహాతో నవీన్ హీరోగా..

ప్రభాస్ సలహాతో నవీన్ హీరోగా..

ఇక యూవీ క్రియేషన్స్ అనుష్కతో ఒక డిఫరెంట్ సినిమాను ప్లాన్ చేసింది. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకుడిగా సెట్ చేసిన కథలో కథానాయకుడిగా నవీన్ అయితే బావుంటుందని ప్రభాస్ సలహా ఇవ్వడంతో దర్శక నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. అందులో అనుష్క 40ఏళ్ల వయసున్న మహిళగా కనిపించనుందట.

అనుష్కతో ప్రేమలో

అనుష్కతో ప్రేమలో

ఇక నవీన్ పొలిశెట్టి 20ఏళ్ళ వయసులో కనిపిస్తాడట. వయసులో 20 ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉన్న జంట మధ్య ప్రేమ కలిగితే ఎలా ఉంటుందనే పాయింట్ లో సినిమాను డిజైన్ చేయనున్నారట. కథ వినగానే అనుష్క అని ఫిక్స్ అయ్యారు. ఇక హీరోగా నవీన్ పొలిశెట్టిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అలా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X