మహేష్ తో లేటు అయ్యేట్లుందని సుకుమార్ ఆ యంగ్ హీరోతో ప్రొసీడ్ ?
టాలీవుడ్ లో ఇప్పుడు పూర్తి స్ధాయి డిమాండ్ ఉన్న దర్శకుడు సుకుమార్.100% లవ్ చిత్రంతో తెలుగు పరిశ్రమలో ఈ దర్శకుడు తిరుగులేని స్ధానం సంపాదించుకున్నాడు. వెంటనేమహేష్ తో ఆఫర్ సంపాదించిన ఈ దర్శకుడు ఆ పాజెక్టు లేటయ్యేటట్లు ఉన్నదని మరో హీరోతో ముందుకెళ్ళే యోచనలో ఊన్నాడు.ఆ సమయంలో మిస్టర్ ఫెరఫెక్ట్ తో హిట్ తెచ్చుకున్న ప్రభాస్ నుంచి కబురు వచ్చింది.
వెంటనే తన దగ్గర ఉన్న స్టోరీలైన్ చెప్పి ఒప్పించి,ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకే స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వినికిడి. అలాగే పవన్ తో అనుకున్న జోకర్ చిత్రం లేనట్లే అంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఆ తర్వాత రాజమౌళి చిత్రానికి బల్క్ డేట్స్ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











