ఉగాదికి ప్రభాస్ సర్‌ప్రైజ్.. రెడీ రెబల్ స్టార్ ఫ్యాన్స్!!

ఈ ఉగాది సందర్భంగా ప్రభాస్ సర్‌ప్రైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. తన లేటెస్ట్ మూవీ ఫస్ట్‌లుక్ ఉగాది కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత సినిమా 'సాహో' డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రెబల్ స్టార్.. ఉగాది సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నారట.

ఉగాది కానుకగా మార్చి 25న తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు అందుకు సంబంధించిన పనుల్లో చిత్రయూనిట్ నిమగ్నమైందని తాజా సమాచారం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Prabhas Surprise: 20th movie First look update

యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూచూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. సాహో డిజాస్టర్ కారణంగా ఈ మూవీపై ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X