అటు బాలయ్య, ఇటు చిరంజీవి.. ప్రభాస్ ఆ కొట్లాటకు దూరంగా ఉంటేనే బెటర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరి హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అభిమానుల్లో జోష్ రావాలి అంటే హీరోల మధ్య బికర పోరు జరగాల్సిందే. గతంలో కలెక్షన్స్ విషయంలో మన సీనియర్ హీరోల మధ్య పోటీ ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా రేర్ గా అలాంటి దృశ్యలు దర్శనమిస్తున్నాయి. ఇక రాబోయే ఒక స్పెషల్ ఫెస్టివల్ ని మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణలు టార్గెట్ చేయగా.. మధ్యలో ప్రభాస్ సినిమా చేరడంతో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

బాలకృష్ణ vs చిరంజీవి..

బాలకృష్ణ vs చిరంజీవి..

అప్పట్లో నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే.. థియేటర్స్ వద్ద ఫస్ట్ వీక్ మొత్తం స్పెషల్ బందోబస్త్ ఏర్పాటు చేసేవారు. పోటాపోటీగా ఇరు వర్గాల అభిమానులు సినిమాలకు వెళ్లేవారు. ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శతకర్ణి వరకు వారి మధ్య పోటీ ఎక్కువగా నడిచింది. కలెక్షన్స్ అందుకోవడంలో ఈ హీరోలిద్దరు చాలా బలంగా పోటీ పడుతుంటారు.

సంక్రాంతి టార్గెట్..

సంక్రాంతి టార్గెట్..

మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అదే ఫెస్టివల్ కి బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్ లో మరో యాక్షన్ మూవీ రానుంది. ఇద్దరు హీరోలు దాదాపు వారి స్పెషల్ డేట్స్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య మెగాస్టార్ అంటే సంక్రాంతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు మొదలవ్వాల్సిందే..

మధ్యలో ప్రభాస్..

మధ్యలో ప్రభాస్..

సాధారణంగా సంక్రాంతి సీజన్ లో రెండు పెద్ద సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ సారి మెగాస్టార్ బాలయ్యతో పాటు ప్రభాస్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న ప్రభాస్ కొంచెం రిలీజ్ విషయంలో రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది.

Recommended Video

Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans
బాహుబలి స్టార్ అయినప్పటికీ..

బాహుబలి స్టార్ అయినప్పటికీ..

ప్రభాస్ మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ వేరే సినిమాలకు పెద్దగా ఉండకపోవచ్చు. బాలయ్య, చిరంజీవి..లాంటి హీరోలు పక్కా మాస్ దర్శకులతో వస్తుండడంతో టాలీవుడ్ లో అయితే వారి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ అందుతాయి. ఇక ప్రభాస్ సినిమా బడ్జెట్ ని బట్టి చూస్తే సోలోగా రోలీజ్ అయితేనే ప్రాఫిట్స్ అందుకోగలడు. మరి ప్రభాస్ తన కొత్త సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తాడా లేక సంక్రాంతికి వస్తాడా అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X