Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ టాపిక్: ‘సాహో’ చిత్రానికి ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు?
Recommended Video
2019 సంవత్సరంలో ఇండియాలో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ మూవీ 'సాహో'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా... రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఆగస్టు 30న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? అనేది తాజాగా ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ ప్రపోజల్ వచ్చినపుడు ఫిక్డ్స్ రెమ్యూనరేషన్ తీసుకోవాలని ప్రభాస్ భావించారని, అయితే దీన్ని ప్యాన్ ఇండియా వైడ్ భారీ ప్రాజెక్టుగా, వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రాఫిట్స్‌లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్.
రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం
‘సాహో' మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్, ప్రాఫిట్ షేరింగ్ అంతా కలిసి దాదాపు రూ. 100 కోట్ల తీసుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియాలో హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్‌గా యంగ్ రెబల్ స్టార్ వార్తల్లోకి ఎక్కడం ఖాయం.
రజనీ, సల్మాన్, షారుక్ ఖాన్‌లను బీట్ చేస్తాడా?
ఇప్పటి వరకు ఇండియాలో హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్లుగా రజనీకాంత్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఉన్నారు. ‘సాహో' మూవీకి ప్రభాస్ రూ. 100 కోట్లు తీసుకున్నట్లయితే..... వారందరినీ అతడు బీట్ చేసినట్లే అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వంద కోట్ల రెమ్యూనరేషన్ మ్యాటర్‌పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు.
ప్రభాస్ నుంచి ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల్లే...
తీస్తే పెద్ద సినిమా తీయాలి, కొడితే బాక్సాఫీస్ దద్దరిల్లేలా గట్టిగా కొట్టాలి... బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ ఇదే ఫాలో అవుతున్నారు. బడ్జెట్ ఎక్కువైనా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నారు. ‘సాహో' తర్వాత ప్రభాస్ కమిటైన చిత్రాలన్నీ కూడా రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ ఉన్న సినిమాలే కావడం గమనార్హం.
ఆగస్టు 30న సాహో గ్రాండ్ రిలీజ్
‘సాహో' మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే క్లైమాక్స్ ఫైట్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగోకపోవడంతో వాటిని మళ్లీ విజువలైజ్ చేస్తున్నారని, అందుకే సినిమా విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చినట్లు తెలుస్తోంది.
సాహో
'సాహో' చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలను ఇందులో ప్రధాన తారాగణంగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట.