హాట్ టాపిక్: ప్రభాస్-దిల్ రాజు కాంబినేషన్లో మరో మూవీ రాబోతోందా?
తెలుగు సినిమా సర్కిల్‌లో కొన్ని రోజులుగా 'సాహో' సినిమా గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇండియాలోనే ఇప్పటి వరకు రాని అతిపెద్ద యాక్షన్ మూవీగా 'సాహో' రూపుదిద్దుకుంది. ఈ సినిమా తర్వాత వెంట వెంటనే ప్రభాస్ నుంచి సినిమాలు రాబోతున్నాయట. ఆల్రెడీ జిల్ ఫేం కెకె రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రీరియడ్ రొమాంటిక్ డ్రామా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్ వినిపిస్తోంది.
'జాన్' తర్వాత ప్రభాస్ వరుస కమిట్మెంట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తనతో గతంలో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల దిల్ రాజు యంగ్ రెబల్ స్టార్‌ను కలిశారని, తన వద్ద ఉన్న ఓ ప్రాజెక్ట్ ప్రపోజల్ చెప్పారని, ఆసక్తికరంగా ఉండటంతో చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' మూవీకి సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైన తర్వాత... దిల్ రాజు చెప్పిన పాయింటుకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు వింటారని, ఆ తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే... ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో చేయాలని దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు బాలీవుడ్లోనూ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











