The Raja Saab 2 : రెండు భాగాలుగా ది రాజా సాబ్.. మేకర్స్ ఎలా ప్లాన్ చేశారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను వింటేజ్ లుక్ తోపాటు డార్లింగ్ తో కామెడీ పండించే ప్రయత్నంలో 'ది రాజా సాబ్' చిత్రం అంచనాలను మించిపోతోంది. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభాస్ లుక్స్, విజువల్స్, మ్యూజిక్, బీజీఎం పరంగా ఎక్కడా లోటు లేకుండా గ్రాండ్ అవుట్ పుట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ కథ విషయంలోనూ దర్శకుడు, నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

దుమ్ములేపుతున్న ది రాజా సాబ్ టీజర్..
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ది రాజా సాబ్ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కేవలం టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. 2 నిమిషాల 28 సెకండ్లు ఉన్న టీజర్ లో ప్రభాస్ ను చాలా సేపు చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ప్రభాస్ వింటేజ్ లుక్, గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం సినిమాపై తారా స్థాయి అంచనాలను క్రియేట్ చేసింది. ప్రభాస్ స్టైలిష్ లుక్, కామెడీ టైమింగ్ విషయాల్లోనూ టీజర్ సక్సెస్ అయ్యింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది.

Prabhas The RajaSaab Movie Has Part 2 Here is Speculations

మేకర్స్ భారీ ప్లాన్.. ఊహించడం కష్టమే..
బాహుబలి తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ చిత్రాలకే పరిమితం అయ్యారు. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో దుమ్ములేపారు. అయితే ప్రభాస్ నుంచి లవ్, కామెడీ వంటి అంశాలు అభిమానులకు వెలితిగా మారాయి. ఈ క్రమంలోనే 'ది రాజా సాబ్' చిత్రాన్ని ప్రభాస్ మునుపెన్నడూ చేయని జోనర్ హార్రర్ ఫాంటసీ అండ్ కామెడీ జోనర్ లో రూపొందిస్తున్నారు. దీంతో ప్రభాస్ కామెడీ, లవ్ చూపించే అవకాశం దక్కింది. మూవీకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా అదిరిపోయింది. కాగా ది రాజా సాబ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని చెబుతున్నారు. రెండు భాగాలుగా ది రాజా సాబ్ ప్రేక్షకులను అలరించబోతోందని అంటున్నారు.

మొదటి భాగంలో ఇదేనా?
ప్రస్తుతం ది రాజా సాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీజర్ లో చూపించినట్టుగా మొదటగా ప్రభాస్ యంగ్ లుక్ లో చేసే అల్లరి, లవ్ అండ్ రొమాన్స్, యాక్షన్ ను చూపించడంతో కొంత కథను చెప్పే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ తో తాత పాత్రలోని ప్రభాస్ ను పరిచయం చేస్తారని.. మిగిలిన కథ 2వ పార్ట్ కు షిఫ్ట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రభాస్ ను ఇలా లాక్ చేస్తున్నారేంటి?
ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు ప్రభాస్. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్లీ ఆ దర్శక నిర్మాతలకు డేట్స్ ఇవ్వడం కష్టంగానే మారుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభాస్ ను సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్ట్స్ లో ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాక్ చేశారు. ఈ క్రమంలోనే 'ది రాజా సాబ్' మేకర్స్ కూడా పార్ట్ 2ను ప్లాన్ చేశారని అంటున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అంటూ ఏదీ లేదు. కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో బజ్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas the raja saab maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X