ప్రభాస్ హిందీ చిత్రానికి లైన్ క్లియర్: బాలీవుడ్‌ హీరోలకు భారీ షాకిచ్చిన డైరెక్టర్.!

By Manoj

టాలీవుడ్‌ నుంచి పరిచయమైనప్పటికీ దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతడు.. తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిపోయాడు. ఇక, 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దీంతో అతడితో సినిమాలు చేయడానికి పోటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ డైరెక్ట్ హిందీ చిత్రం చేయబోతున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

ఇక్కడ ఫట్.. అక్కడ మాత్రం సూపర్ హిట్

ఇక్కడ ఫట్.. అక్కడ మాత్రం సూపర్ హిట్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే అతడు ‘సాహో' అనే సినిమా చేశాడు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ.. భిన్నమైన ఫలితాన్ని అందుకుంది. తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయిన ‘సాహో'.. హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

రొమాంటిక్ ప్రభాస్... పాత కాలం ప్రేమకథ

రొమాంటిక్ ప్రభాస్... పాత కాలం ప్రేమకథ

‘సాహో' వంటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. 1960 నాటి ప్రేమకథతో, రొమాంటిక్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘ఓ డియర్', ‘రాధేశ్యామ్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ కొత్తగా కనిపిస్తాడని టాక్.

పాన్ వరల్డ్ ప్రాజెక్టులో యంగ్ రెబెల్ స్టార్

పాన్ వరల్డ్ ప్రాజెక్టులో యంగ్ రెబెల్ స్టార్

ఒక సినిమా పట్టాలపై ఉండగానే ప్రభాస్ మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టేశాడు. ‘మహానటి' వంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టును వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ కోసం వాళ్లంతా క్యూ కట్టేస్తున్నారు

ప్రభాస్ కోసం వాళ్లంతా క్యూ కట్టేస్తున్నారు

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అతడితో సినిమాలు చేయడానికి మన దర్శకులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన వాళ్లు కూడా పోటీ పడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘సాహో' తర్వాత బాలీవుడ్‌లోని పలువురు దర్శకులు అతడితో చర్చలు కూడా జరిపారు.

లేటెస్ట్ అప్డేట్: భారీ హిందీ చిత్రంలో ప్రభాస్

లేటెస్ట్ అప్డేట్: భారీ హిందీ చిత్రంలో ప్రభాస్

రాధాకృష్ణతో సినిమా షూటింగ్ జరుగుతోంది.. దాని తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ సినిమా మొదలవుతుంది... ఈ నేపథ్యంలో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. బాలీవుడ్‌ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించబోయే భారీ హిందీ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ నటిస్తున్నాడట.

Recommended Video

Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
ఆ హీరోలను కాదని రెబెల్ స్టార్ చెంతకు.!

ఆ హీరోలను కాదని రెబెల్ స్టార్ చెంతకు.!

అజ‌య్ దేవ‌గ‌ణ్ మూవీ ‘తానాజీ'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు యంగ్ డైరెక్టర్ ఓం రౌత్. ఈ సినిమా ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలవడంతో.. అతడి తర్వాతి సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదే సమయంలో కొందరు బాలీవుడ్ హీరోలు సైతం అతడితో మూవీ చేయాలనుకున్నారు. కానీ, రౌత్ మాత్రం ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X