ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. RRRలో ప్రభాస్ ఇలా.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరినీ!

Recommended Video

Interesting Update About RRR Movie | SS Rajamouli | Ram Charan | NTR | Prabhas || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో లింక్ పెడుతూ ఆసక్తికర వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

షూటింగ్ వాయిదా

షూటింగ్ వాయిదా

దర్శక ధీరుడు రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇటీవల చిత్ర యూనిట్ కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎంపికైన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ చిత్రం నుంచి తప్పుకుంది. రాంచరణ్ గాయపడడం వలన షూటింగ్ ని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.

 పిచ్చెక్కించే న్యూస్

పిచ్చెక్కించే న్యూస్

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం తెరకెక్కుతున్నప్పడు అనేక ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అధికారికంగా ప్రకటించక పోయినా కొన్ని వార్తలు అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంటాయి. తాజాగా అలాంటి వార్తే టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగం కాబోతున్నాడు అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తమైంది. దీనితో ప్రభాస్ ని కూడా ఆర్ఆర్ఆర్ చిత్రమో ఇన్వాల్వ్ చేస్తే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరినీ

ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరినీ

ప్రభాస్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలని ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తాడట. చిత్ర ప్రారంభంలో ప్రభాస్ కొమరం భీం గురించి, అల్లూరి గురించి తన వాయిస్ ఓవర్ తో కొంత సమాచారం ఇస్తాడని ఆ తర్వాత అసలు కథ మొదలవుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు వాస్తవమో తేలాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే కనుక నిజమైది ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఇంకాస్త హైప్ పెరగడం ఖాయం.

కొత్త హీరోయిన్ కోసం

కొత్త హీరోయిన్ కోసం

ఇదిలా ఉండగా డైసీ ఎడ్గార్ జోన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి తప్పుకోవడంతో రాజమౌళి ఎన్టీఆర్ కు కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు. నిత్యామీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ కు జోడిగా అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X