For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Salaar’లో ప్రభాస్ క్యారెక్టర్‌ ఇదే: తొలిసారి హై ఓల్టేజ్ పాత్రలో.. ఆ ఎపిసోడ్‌కు గూస్‌బమ్స్ ఖాయం

  |

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడు సినిమాల షూటింగ్‌లను చేస్తున్నాడు. ఒక్కో సినిమాను ఒక్కో జోనర్‌లో తీయడమే కాదు.. అన్నింటినీ పాన్ ఇండియా రేంజ్‌తో చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించే చిత్రాల్లో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్ర గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   అప్పటి నుంచి పంథాను మార్చేశాడు

  అప్పటి నుంచి పంథాను మార్చేశాడు

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' సిరీస్‌తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ‘సాహో' అనే సినిమాను చేశాడు. ఇది దక్షిణాదిలో అంతగా ఆడకున్నా.. ఉత్తరాదిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

  తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

  తొలిసారి అలాంటి సినిమాలో ప్రభాస్

  సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ప్రభాస్. ‘బాహుబలి' రాజులా.. ‘సాహో'లో యాక్షన్ హీరోలా కనిపించిన అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో ‘రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారి రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది.

  అనుకున్నది అవి.. మొదలెట్టింది ఇది

  అనుకున్నది అవి.. మొదలెట్టింది ఇది

  ‘రాధే శ్యామ్' మూవీ షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. అన్నింటికంటే ముందే దీన్ని ప్రారంభించాడు.

  దానికి ఏమాత్రం తీసిపోకుండా సలార్

  దానికి ఏమాత్రం తీసిపోకుండా సలార్

  ‘KGF'తో తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్'ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. ఇందులో కూడా హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయబోతున్నాడట. మరీ ముఖ్యంగా ఇందులో అతడి క్యారెక్టరైజేషన్ అరుపులు పెట్టిస్తుందట. ఇక, ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

  బాహుబలి తర్వాత అలా చేస్తున్నాడు

  బాహుబలి తర్వాత అలా చేస్తున్నాడు

  ఆ మధ్య సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన ‘సలార్' మొదటి షెడ్యూల్ సమయంలో గడ్డాన్ని ట్రిమ్ చేసి యంగ్ మ్యాన్‌గా కనిపించాడు ప్రభాస్. కానీ, సినిమా ప్రకటన సమయంలో మాత్రం క్లీన్ షేవ్‌తో పాటు కోరమీసంతో ఉన్న లుక్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్‌లు అనుకున్నారంతా. కానీ, అతడు ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

   ‘సలార్'లో ప్రభాస్ క్యారెక్టర్‌ డీటేల్స్ లీక్

  ‘సలార్'లో ప్రభాస్ క్యారెక్టర్‌ డీటేల్స్ లీక్

  పాన్ ఇండియా చిత్రం కావడంతో ‘సలార్' మూవీ ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడట. ఇది మూవీకే హైలైట్‌గా నిలిచే రోల్ అనే టాక్ వినిపిస్తోంది.

  హై ఓల్టేజ్ రోల్.. గూస్‌బమ్స్ గ్యారెంటీ

  హై ఓల్టేజ్ రోల్.. గూస్‌బమ్స్ గ్యారెంటీ

  ‘సలార్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అది కూడా తండ్రీ కొడుకుల పాత్ర అని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే పాత్రలోనే అతడు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. ఈ క్యారెక్టర్ ఉన్నంత సేపూ గూస్‌బమ్స్ వచ్చే విధంగా డిజైన్ చేశాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. మరీ ముఖ్యంగా అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్ పూనకాలు తెప్పిస్తుందని సమాచారం.

  English summary
  Prabhas to play Army Officer Role in Salaar Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X