Prabhas: కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్... అభిమానులకు నిరాశే!
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబర్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ మరో హీరో సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. హీరో ప్రభాస్, మంచు విష్ణు నటిస్తున్న ఒక పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే....
ఈ మధ్య రీసెంట్ గా హీరో మంచు విష్ణు తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న కన్నప్ప ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించి ఆగస్టులో కాళహస్తిలో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా చేశారు. స్వయంగా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయనే ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నారట. బాలీవుడ్ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

శివ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుండగా భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ఈ భక్త కన్నప్ప ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కన్నప్ప సినిమాలో హీరో ప్రభాస్ స్పెషల్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు అనే వార్త వైరల్ అవుతుందని రమేష్ బాల అనే తమిళ్ ట్రేడ్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిని మెన్షన్ చేస్తూ మంచు విష్ణు హర హర మహాదేవ్ అంటూ రాసుకొచ్చారు.
ఈ లెక్కన ఈ సినిమాలో మహా శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. నిజానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కెరియర్ లో ఈ భక్త కన్నప్ప ఒక మైల్ స్టోన్ మూవీ. మీ పెదనాన్న సినిమాలు ఏమైనా రీమేక్ చేయాలి అనుకుంటున్నారా అంటే ఈ సినిమా చేయాలి అని గతంలో ప్రభాస్ కూడా అన్నాడు. అయితే అలాంటి సినిమాని మంచు విష్ణు మొదలుపెట్టడంతో ఆ సినిమాలో మహా శివుడి పాత్రలో అయినా కనిపించడానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఇది నిజమో కాదో పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ని మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది అనే చెప్పాలి. ఆయన ఇప్పటికే 'ఆదిపురుష్'లో రాముడిగా కనిపించగా 'కల్కి'లో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆ లెక్కన ఈ సినిమాలో కూడా ఆయన కనిపిస్తే మూడవ దేవుడి పాత్రలో కనిపించినట్లు అవుతుంది.
ఇక కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగింది కాబట్టి, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలుకాదు. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణానికి ఆర్నెల్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం అని, కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న సినిమా ఇది అని మొదలు పెట్టినప్పుడు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ కథకి కీలకమైన మెరుగులు దిద్దగా మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











