ప్రభాస్‌తో టాప్ హీరోయిన్.. క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామతో రొమాన్స్!
గత కొన్నాళ్ల నుంచి ఇండియన్ సినిమా వైడ్ గా మోస్ట్ డిమాండ్ ఉన్న అగ్ర హీరోల్లో మన తెలుగువాడైన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలిచ్చిన సంచలన విజయాలతో ప్రభాస్ ఇండియాలోనే అతిపెద్ద స్టార్ గా మారిపోగా అక్కడి నుంచి తాను ఏ చిన్న దర్శపడితే చూసినా సరే ఆ సినిమాలు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో మారిపోతున్నాయి.
ఇలా డార్లింగ్ హీరో ఒకదాన్ని మించిన మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో ప్రస్తుతం మరిన్ని బిగ్ ప్రాజెక్ట్ లు ఉండగా వీటిలో సీతా రామం దర్శకుడు హను రాఘవ పూడితో చేస్తున్న ఫౌజి సినిమా కూడా ఒకటి.

కాగా ఈ సినిమా 1940వ సమయంలో యుద్ధ నేపథ్యంలో తెరుకెక్కిస్తుండగా ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నటి నటిస్తున్నట్టుగా పలు రూమర్స్ ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వీటి ప్రకారం ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటి ఆలియ భట్ అట. కాగా ఇపుడు ఆలియా పేరు కూడా ఈ సినిమా కోసం ఇప్పుడు వినిపించడం మొదలైంది.
అయితే ఆల్రెడీ ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ముహూర్త కార్యక్రమాల్లో కూడా ప్రభాస్ సరసన ఆమె కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఇప్పుడు అలియా భట్ లాంటి టాప్ స్టార్ పేరు కూడా వినిపించడంతో మరి మనవి పరిస్థితి ఏంటి అనేది కూడా ఆసక్తిగా మారింది.
మరి ఈ సినిమాలో ఇద్దరూ ఉంటారా లేక ఒక్క హీరోయిన్ మాత్రమే కనిపిస్తుందా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మరి ఈ సినిమాలో రెండు టైమ్ లైన్స్ ఏమైనా ప్లాన్ చేసి ఇద్దరు హీరోయిన్స్ హీరోయిన్స్ ని సెటప్ చేశారో ఏమో కానీ ఆలియా భట్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి.

సో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా మాత్రమే కాకుండా దర్శకుడు మారుతి కలయికలో కూడా ఓ భారీ సినిమా ది రాజా సాబ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో కూడా ఇద్దరు హాట్ బ్యూటీలు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఆదిపురుష్ తో నష్టపోయిన నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా ఈ సినిమాని చేస్తుండగా మేకర్స్ ఏకంగా ఈ సినిమాని 400 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఈ ఏప్రిల్ లోనే విడుదల చేయాల్సి ఉంది కాని ఇంకా పనులు పెండింగ్ ఉండడం మూలాన వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











