కాజల్‌ని ఓదార్చటానికి ప్రబాస్ ముంబై ప్రయాణం!?
టాలీవుడ్ కి చెందిన దాన్ని కాను అంటూ బాలీవుడ్ లో సినిమా చేస్తున్న కాజల్ రీసెంట్ గా కామెంట్ చేసి వార్తలు కెక్కిన సంగితి తెలిసిందే. ఆ వార్తలు అంతటా హాట్ టాపిక్ గా మారి ఆమెను తెలగు పరిశ్రమలో పెద్దలు బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని వినపడింది.దాంతో ఈ పీల్డుపై ఇంకా ఎంతో ఆశలు పెట్టుకున్న కాజల్ ని భాధించాయి. దాంతో ఆమె తనకు బాగా దగ్గరైన ప్రభాస్ కి సిట్యువేషన్ చెప్పుకుని సాడ్ సాంగేసుకుందిట.
దానికి ప్రభాస్ చాలా కలతపడిపోయి వెంటనే ముంబై ప్రయాణం పెట్టుకున్నాట్ట. ఆమెను ఓదార్చటానికే ప్రభాస్ బయిలు దేరాడని పరిశ్రమలో అంతటా వినపడుతోంది. ఇక కాజల్ ప్రస్తుతం సింగం హిందీ సినిమాలో చేస్తోంది. తెలుగులో వచ్చి హిట్టయిన యముడు చిత్రానికి అది రీమేక్. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని గోల్ మాల్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











