For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు డైరెక్టర్‌కు ప్రభాస్ బిగ్ షాక్: ఆ సినిమా ఫలితం తర్వాత యూటర్న్

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, ఫైట్స్, స్టైల్స్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలంగా హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్‌కు చేరింది. దీంతో అప్పటి నుంచి ఈ స్టార్ రెట్టించిన ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకోవడంతో పాటు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

  డ్రెస్ ఉన్నా లేనట్లే మలైకా హాట్ ట్రీట్: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  ఇండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్న రీతిలో స్పందన లభించలేదు. ఫలితంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఇది ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలను మిగిల్చింది. అయినప్పటికీ ఈ స్టార్ హీరో ఏమాత్రం నిరాశ చెందకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, మరికొంత మంది దర్శకుల కథలను కూడా వింటున్నాడు.

  Prabhas U turn on Maruthis Raja Deluxe Movie

  పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైన విషయం తెలిసిందే. ఇక, ఇటీవలే ఈ సినిమా గురించి మారుతి కూడా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని, ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎవరూ ఊహించని రీతిలో డిజైన్ చేశామని ఈ దర్శకుడు వెల్లడించాడు.

  ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!

  మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమా ఫలానా రోజు ప్రారంభం కాబోతుందంటూ ఈ మధ్య జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మారుతి 'రాజా డీలక్స్' మూవీని ప్రభాస్ హోల్ట్‌లో పెట్టేశాడట. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' మూవీ విడుదలైంది. దీనికి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఈ కారణంగానే ప్రభాస్.. మారుతి సినిమా విషయం యూటర్న్ తీసుకుని ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

  Prabhas U turn on Maruthis Raja Deluxe Movie

  ఇదిలా ఉండగా.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్నట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. 'మిర్చి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరూ మరోసారి జతకట్టబోతున్నట్లు తెలిసింది. అయితే, ఈ చిత్రం మాత్రం ఎన్టీఆర్ సినిమా పూర్తైన తర్వాతనే కొరటాల పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందని అంటున్నారు.

  English summary
  Prabhas Will do Raja Deluxe Movie with Maruthi under DVV Danayya Production. Latest Reports Says Prabhas Hold This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X