ప్రభాస్ సినిమా కోసం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీమ్.. వాళ్లకోసమే 300కోట్లు..
ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు ఆలోచనలు మారాయి.. అంచనాలు మారాయి. బాహుబలితో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్ రాజమౌళి లేకుండా హిట్టు కొట్టగలడా అనే అనుమానాలకు సాహూ బిజినెస్ ఒక విధంగా ఉదాహరణగా నిలిచింది. బాలీవుడ్ ఆడియెన్స్ కి అయితే ఆ సినిమా బాగానే నచ్చింది. కాన సౌత్ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ వాళ్లకు నచ్చిన సినిమా వస్తే ప్రభాస్ ని వదిలిపెట్టరు.

అందుకే ప్రభాస్ తో ఆ సినిమా..
ఒక విధంగా ప్రభాస్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే బాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ఓం రావత్ ఏకంగా రామాయణం కథను ప్రభాస్ తో తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల వచ్చి ఆ ఎనౌన్స్మెంట్ ప్రభాస్ రేంజ్ ని మరింతగా పెంచడంతో సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు చర్చనీయాంశంగా మారాయి.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీమ్..
ఇక ఆది పురుష్ సినిమా కోసం ఎలాంటి టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు అనే విషయంలోకి వెళితే.. చిత్ర దర్శకుడు ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని దింపనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు వర్క్ చేసిన VFX టీమ్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే దర్శకుడు వారితో చర్చలు జరిపినట్లు సమాచారం.

ఒక్క ఎపిసోడ్ కోసమే 150కోట్లు..
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. HBO ఛానెల్ లో వచ్చిన ఆ సిరీస్ లో ఎక్కువగా VFX గ్రాఫిక్స్ అభిమానులను ఆకర్షించాయి. కేవలం ఒక్కో ఎపిసోడ్ కోసమే 100 కోట్ల నుంచి 150కోట్ల వరకు ఖర్చు చేశారు. అలాంటి సిరీస్ లో వర్క్ చేసిన టీమ్ ని ఆది పురుష్ కోసం సెలెక్ట్ చేసుకొనున్నారట.
Recommended Video

300కోట్లు దాని కోసంమే..
రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సెట్స్ ఎంత వేసినా కూడా విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు చాలా అవసరమని దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. సినిమా కోసం అనుకున్న 500కోట్ల బడ్జెట్ లో 300కోట్లు గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీమ్ ఆది పురుష్ సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టి 2022లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











