మొత్తానికి ఒక పని పూర్తి చేసిన ప్రభాస్.. త్వరలోనే స్పెషల్ అప్డేట్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల మరో పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాతో రానున్నట్లు క్లారిటీ ఇవ్వగానే అభిమానులు తెగ సంబరపడిపోయారు. లాక్ డౌన్ కారణంగా అందరిలాగానే విభిన్నమైన కథలను విన్న ప్రభాస్ తన రేంజ్ మరింత పెరిగే విదంగా అడుగులు వేస్తున్నాడు. ఇక సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ముందు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయక తప్పదు.
సాహో అనంతరం సైలెంట్ గా రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. దాదాపు ఆ సినిమా షూటింగ్ ఏండింగ్ కు వచ్చేసింది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది కూడా. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన పాత్ర యొక్క సీన్స్ ను ఆల్ మోస్ట్ ఫినిష్ చేసినట్లు సమాచారం. ఇక ఆఖరి షెడ్యూల్ లో వారం రోజులు మాత్రమే పాల్గొంటాడట. ఇక దర్శకుడు మిగతా నటీనటులకు సంబంధించిన సీన్స్ కోసం కాస్తా ఎక్కువ సమయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక త్వరలోనే రాధేశ్యామ్ కు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వెలువడనున్నట్లు సమాచారం. ముందుగా టీజర్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారట. 2021 న్యూ ఇయర్ సందర్భంగా ఏదైనా స్పెషల్ టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు యొక్క పనులు కాస్త నెమ్మదిగానే సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు అభిమానులు అప్డేట్స్ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ న్యూ ఇయర్ కు ఏమైనా ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











