ప్రభాస్ సినిమాకు మరో కొత్త సమస్య.. అప్డేట్ ఇప్పట్లో లేనట్లే?
రెబల్ స్టార్ ప్రభాస్ టీమ్ పరిస్థితి ఏమిటి అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సాహో అనంతరం ప్రభాస్ పెద్ద సినిమా చేయకూడదని అనుకున్నప్పటికి యూవీ క్రియేషన్స్ వినకుండా రాధాకృష్ణ ప్రాజెక్టును కూడా పాన్ ఇండియాగా మార్చేసింది. ఆ ప్రాజెక్టుకు రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే విషయం పక్కనపెడితే సినిమాకు వస్తున్న సమస్యల సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది.
కరెక్ట్ గా ప్లాన్ చెసుకొని ఉంటే.. లాక్ డౌన్ కంటే ముందే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యి ఉండేది. కానీ యూవీ క్రియేషన్స్ అతి ఆలోచనల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యిందని టాక్ వస్తోంది. అయితే ఇప్పుడు వారికి కరోనా వైరస్ కారణంగా సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఎందుకంటే సినిమా కథ ప్రకారం విదేశాల్లో తప్పకుండా షూటింగ్స్ చేయాల్సిందే. సెట్స్ వేసి మ్యానేజ్ చేయాలని అనుకున్నప్పటికి పూర్తిగా సెట్స్ పైనే ఆదరపడటం కుదరదట.

అందుకే తప్పనిసరిగా కొన్ని సన్నివేశాల కోసం ఇంగ్లీష్ దేశాలకు వెళ్లాలని ప్రభాస్ టీమ్ ఆలోచిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చిస్తుంటే రాష్ట్రం కూడా దాటలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చిత్ర యూనిట్ కాస్త సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక గత రెండు నెలల నుంచి అభిమానుల కోసం స్పెషల్ టీజర్ లేదా పోస్టర్ ఫస్ట్ లుక్ వదిలే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి. ఇంతవరకు వాటిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి అభిమానుల కొరికను ప్రభాస్ టీమ్ ఎప్పుడు నెరవేరుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











