గోపిచంద్ తరువాత ప్రభాస్.. 'సాహసం' కాదు అంతకుమించి.. మరో కొత్త కాంబినేషన్ రెడీ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలకే స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు బిగ్ బడ్జెట్ సినిమా అంటే మినిమమ్ హిట్టవ్వాలి అని కమర్షియల్ గా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి పాన్ ఇండియా అనే పదానికి కొత్త అర్దాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా కథలను ఒకే చేస్తున్నప్పటికీ ఒకదానికొకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

లవ్ స్టొరీ తరువాత.. కంప్లీట్ యాక్షన్
ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక విభిన్నమైన లవ్ స్టొరీ. ఇక ఆ తరువాత సలార్ తో రాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతున్న సలార్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.

ప్రభాస్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లినట్లే..
ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలతో బిజీ అయ్యాడు. ఇలా బిజీ అవ్వడం కెరీర్ లో ఇదే మొదటిసారి కావచ్చు. సలార్ అనంతరం ఆది పురుష్ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో రానున్న విషయం తెలిసిందే. ఓ రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాతో ప్రభాస్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లడం కాయమని చెప్పవచ్చు.

సాహసం.. కాదు అంతకుమించి..
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత బిగ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి కామిట్మెంట్ ఇచ్చాడు. ఇక ఇటీవల మైత్రి నిర్మాతలు చంద్రశేఖర్ యేలేటితో కథపై చర్చలు జరపగా సాహసం కంటే హై లెవెల్లో ఉండే అడ్వెంచర్ యాక్షన్ కథను వినిపించినట్లు టాక్ వస్తోంది.
Recommended Video

నిర్ణయం ప్రభాస్ చేతుల్లోనే..?
చంద్రశేఖర్ యేలేటి, గోపిచంద్ తో తీసిన సాహసం ఓ వర్గం అడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మరో లెవెల్లో ఉండేదని అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. ఇక ఇప్పుడు ప్రభాస్ కాబట్టి దర్శకుడికి బడ్జెట్ పరిధిలు ఏమి ఉండవు. చంద్రశేఖర్ ఇటీవల చెక్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అతను ఇంతవరకు కమర్షియల్ గా బిగ్ సక్సెస్ చూడలేదు. కానీ చేసిన సినిమాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. మరి ప్రభాస్ ఆ దర్శకుడితో వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











