Prabhas దెయ్యం కథ నుంచి మరో లీక్.. అలా సెట్ చేస్తున్న డైరెక్టర్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా ప్రస్తుతం అతిపెద్ద ప్రాజెక్టులతో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రభాస్ ఒక చిన్న బడ్జెట్లో సినిమాను తీయాలి అని అనుకుంటున్నాడు. మొత్తానికి డైరెక్టర్ మారుతి అయితే ఒక కథను సెట్ చేశాడు. వీలైనంత త్వరగా కూడా ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అయితే మారుతితో సినిమా వద్దని అభిమానుల నుంచి ఒక విధంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టును మాత్రం మంచి కంటెంట్ తో తెర పైకి తీసుకువచ్చి ఫ్యాన్స్ ను మెప్పించాలి అని అనుకుంటున్నారు. ఇక ఆ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 డిజాస్టర్ రావడంతో

డిజాస్టర్ రావడంతో


ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అసలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రభాస్ తదుపరి సినిమాతో అయినా మళ్ళీ ట్రాక్లోకి రావాలి అని ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే ప్రాజెక్టు K కూడా షూటింగ్ దశలో ఉంది.

 మారుతితో సినిమా

మారుతితో సినిమా


అయితే ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ఇటీవల మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఆ సినిమాను వీలైనంత త్వరగా కూడా పూర్తి చేయాలి అని ముందుగానే పక్కా ప్రణాళికలు కూడా రచించారు. అయితే మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయడానికి వీల్లేదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కొన్ని నెగటివ్ ట్యాక్స్ కూడా ట్రెండింగ్ అయ్యేలా చేశారు.

 ఛాలెంజ్ గా తీసుకున్న ప్రభాస్

ఛాలెంజ్ గా తీసుకున్న ప్రభాస్

అయితే ప్రభాస్ మాత్రం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మారుతి దర్శకత్వంలో సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఇది ఛాలెంజ్ గా కూడా తీసుకున్నట్లు సమాచారం. మారుతి మీద నమ్మకంతోనే ప్రభాస్ హారర్ కాన్సెప్ట్ లో కామెడీ సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు మారుతి కూడా ప్రభాస్ నమ్మినట్లుగానే మంచి కంటెంట్ ఉన్న కథను తెర పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.

అంచనాలకు తగ్గట్టుగానే

అంచనాలకు తగ్గట్టుగానే

ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు మొదటి నుంచి ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక ప్రత్యేకమైన బంగ్లా సెట్ కూడా రెడీ అయ్యిందని ఈ సినిమా కామెడీ హారర్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అని కూడా కథనాలు వెలుపడ్డాయి. అయితే ఈ విషయంపై మారుతి ఇంతవరకు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా మాత్రం ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది అని వివరణ ఇచ్చాడు.

తాత మనవడు స్టోరీ

తాత మనవడు స్టోరీ

కానీ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరొక టాక్ కూడా వైరల్ గా మారుతొంది. ఈ సినిమా కథలో ప్రభాస్ మనవడిగా అలాగే గ్రాండ్ ఫాదర్ చుట్టూ కథ తిరుగుతుందట. అలా ఎమోషనల్ బాండింగ్ నుంచి సినిమాలో ఒక హారర్ ఎలిమెంట్ హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో తనలోని కామెడీ టైమింగ్ కూడా చూపిస్తాడని సమాచారం. దర్శకుడు మారుతి ఈ సినిమాను హారర్ కామెడీ మూవీగా వెండితెరపైకి తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X