twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas మరో రెండు సర్‌ప్రైజ్‌లు.. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నది కూడా వాటి కోసమే!

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తానికి 25వ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సినిమా కథలు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా అభిమానులకు సరికొత్త ఇస్తున్నాడు. ఒక సినిమా అయితే గాని మరొక సినిమాను మొదలు పెట్టని ఈ రోజుల్లో ప్రభాస్ మాత్రం ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టడం విశేషం. బాహుబలి తర్వాత సాహో కోసం మరింత ఆలస్యం చేసిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. ఇక అభిమానులకు మరో మూడేళ్ల వరకు గ్యాప్ లేకుండా అప్డేట్స్ రానున్నాయి. అలాగే బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అసలైన కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెండు కీలకమైన సర్‌ప్రైజ్‌లు రానున్నట్లు తెలుస్తోంది.

     ప్రభాస్ కోసం ఏసురుచూపులు

    ప్రభాస్ కోసం ఏసురుచూపులు

    రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సాహో కూడా భారీ ఓపెనింగ్స్ తో అతని మార్కెట్ వ్యాల్యూ ఏమిటో మరోసారి రుజువు చేసింది. దీంతో ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు చాలా మంది అగ్ర దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా అతనితో సినిమా చేయాలని ప్రయత్నాలు జరుపుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

     లవ్ అడ్వెంచర్ మూవీ

    లవ్ అడ్వెంచర్ మూవీ

    ఎలాంటి సినిమా తీసిన కూడా ప్రభాస్ అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా ఉండాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతే కాకుండా డిఫరెంట్ జానర్స్ ను కూడా ట్రై చేస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సినిమాలో మంచి అడ్వెంచర్ లవ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.. ఈ సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు.

     మరో రెండు సర్‌ప్రైజ్‌లు

    మరో రెండు సర్‌ప్రైజ్‌లు

    రాదేశ్యామ్ సినిమాకు సంబంధించిన మరొక రెండు ముఖ్యమైన అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయాల్సి ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే ఈనెల 13వ తేదీన ఒక చిన్న టీజర్ అప్డేట్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ అభిమానులకు అవి తప్పకుండా నచ్చుతాయని తెలుస్తోంది.

    వరుసగా బడా సినిమాలు

    వరుసగా బడా సినిమాలు

    ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దాదాపు అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. సినిమా వచ్చే ఏడాది భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ K మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సినిమా 2024 లో రావచ్చు. ప్రభాస్ 25వ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్నట్లు గురువారం అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

    English summary
    Prabhas upcoming project another key updates,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X