ప్రభాస్ యాక్షన్ సినిమాపై కిక్కిచ్చే గాసిప్.. రెండు భాగాలుగా మరో సినిమా?
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం అంతకు మించి అనేలా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. సాహో సినిమా అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికి రెబల్ స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమయ్యింది. ఇక రాబోయే రాధేశ్యామ్ సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రభాస్ నమ్మకంతో ఉన్నాడు. ఇక ప్రస్తుతం మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన ప్రభాస్ అందులో ఒక సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ ఒక్క సినిమాతో
ప్రభాస్ బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఆ ఒక్క సినిమాతోనే డార్లింగ్ కు విదేశాల్లో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక రాబోయే సినిమాలను కూడా విదేశాల్లో భారీగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందిన రాధేశ్యామ్ సినిమా ను కూడా వరల్డ్ వైడ్ గా భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

కరోనా కారణంగా వాయిదా
ఇక రాధేశ్యామ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకోగా కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మార్చిలో వస్తుందని అంటున్నారు గాని సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నమ్మలేని పరిస్థితి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. పూర్వ జన్మలకు సంబంధించిన అంశాలతో సినిమా ఉంటుందట.

గ్యాప్ లేకుండా వర్క్..
ఇక ప్రభాస్ నుంచి రాబోయే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో సలార్ కూడా పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమాను కూడా వాయిదా వేయక తప్పలేదు. ఇక సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. నిర్మాత దర్శకుడు గ్యాప్ లేకుండా పనులన్నీ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు.

రెండు భాగాలుగా సలార్?
ఇక సలార్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే మూడున్నర గంటలకు పైగా ఫుటేజ్ ను పూర్తి చేశాడట. ఇక కథను ఇంకాస్త కొనసాగిస్తే బావుంటుందని కూడా ఆలోచించారట.

ప్రభాస్ నుంచి రానున్న సినిమాలు?
ప్రభాస్ ఇమేజ్ ను మార్కెట్ ను వాడుకోవాడంలో ఎలాంటి తప్పు లేదని అందుకే ఎడిట్ లో మిగతా సీన్స్ కట్ చేయకుండా రెండవ భాగంగా విడుదల చేయాలని చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ప్రాజెక్ట్ K, ఆది పురుష్, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఆలోచిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











