ఆ హీరో చేయాల్సిన సినిమాలో ప్రభాస్.. మారుతి కథపై ఎందుకంత ఆసక్తి అంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం అతని చేతుల్లో ఉన్న సినిమాలు ఇతర ఏ స్టార్ హీరో కూడా లేవని చెప్పవచ్చు. ప్రతి సినిమా కూడా మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కొన్ని సినిమాలు అయితే ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడు మారుతితో సినిమా చేసేందుకు చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే మారుతీ ఆ కథను ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట కానీ ప్రభాస్ కు కథ నచ్చడంతో తనవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలాంటి కథ రాసుకున్నా..

ఎలాంటి కథ రాసుకున్నా..

దర్శకుడు మారుతి ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంటాడు. ఇక అతను కథ రాసుకున్నాడు అంటే ముందుగా ను ఫైనల్ చేసే వరకు కూడా గ్యాప్ తీసుకోడు. కెరీర్ మొదటి నుంచి కూడా దర్శకుడు మారుతి ప్రతి కథ విషయంలో కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో కూడా సినిమాను ఫైనల్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని..

ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని..

దాదాపు ఆ స్క్రిప్ట్ కూడా పూర్తి అయినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కూడా చాలా బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ మారుతి తో సినిమా చేసేందుకు ఏ విధంగా ఆలోచించి ఒప్పుకున్నాడు అనేది కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశం మారింది. సాధారణంగా ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్లో అయితే ఏ దర్శకుడు కూడా అతనితో సినిమా చేసేందుకు ప్రయత్నం చేయడు. కథ నచ్చిన కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం ఉండదు. అందుకే ఏదైనా ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యాకా అతని దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నారు.

 ప్రభాస్ స్వయంగా పిలిచి

ప్రభాస్ స్వయంగా పిలిచి

ఇక మొదట ప్రభాస్ దగ్గరికి మారుతి కూడా వెళ్లలేదట. ప్రభాస్ స్వయంగా దగ్గరకు పిలుచుకొని మన ఇద్దరం ఒక సినిమా చేద్దాం అని చెప్పాడట. ప్రభాస్ మారుతి ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మారుతి ప్రభాస్ కోసం మొదట ఎలాంటి కథను ఫైనల్ చేయలేదట. ఇప్పుడు ప్రభాస్ చేయబోయే సినిమా కథ ముందుగా మరొక హీరో కోసం అనుకున్నట్లుగా తెలుస్తోంది.

 రవితేజకు కుదరకపోవడంతో..

రవితేజకు కుదరకపోవడంతో..

ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని కూడా తెలుస్తోంది. ఇక యు వి క్రియేషన్స్ రవితేజ ఒక సినిమా చేయాలని గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతితో పూర్తి కథను కూడా రిజిస్టర్ చేయించారు. అయితే ఆ కథ సెట్టయ్యే క్రమంలో రవితేజ వెంటవెంటనే మూడు ప్రాజెక్టుల కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో రవితేజ ప్రాజెక్టు చేయలేను అని అన్నాడట.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
ఎందుకు ఒప్పుకున్నాడంటే..

ఎందుకు ఒప్పుకున్నాడంటే..

కొంత సమయం పడుతుందని కావాలంటే వెయిట్ చేయమని కూడా రబితేజ చెప్పాడట. ఇక మారుతి అతని కోసం ఎదురు చూడలేదు. మరొక హీరో కోసం వెతికే పనిలో పడ్డాడట. ఇక ఆ కథ గురించి తెలుసుకున్న ప్రభాస్ ఒకసారి కథ చెప్పాలని అనడంతో మారుతి వివరణ ఇచ్చారు. ఇక ఆ కథ విన్న తర్వాత ప్రభాస్ కు నచ్చడంతో కొన్ని మార్పులు చేసి దానిని పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చమని కూడా చెప్పాడట. సినిమా కథలో కామెడీతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇక మారుతి సంతోషంతో ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X