ప్రభాస్ 'వారధి' చిత్రం విడుదల తేదీ ఖరారు
ప్రభాస్,అనూష్క కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వారధి'. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 17నుంచి జరగనుంది. ఆ రోజు నుంచి క్లైమాక్స్ సీన్స్ తీస్తారు. ఈ చిత్రంలో అనూష్కతో పాటు మరో హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.
ఈ చిత్రంలో కథ గురించి ప్రభాస్ మాట్లాడుతూ...మనసు, అద్దం రెండూ ఒక్కటే. ఒక్కసారి ముక్కలైపోతే మళ్లీ అతుక్కోవు అంటుంటారు. కానీ అలాంటి మనసులకూ మరమ్మత్తులు చేశాడో యువకుడు. అతని కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. 'వారధి'టైటిల్ మరీ సాప్ట్ గా ఉందని దాన్ని 'రుద్ర'గా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు తొంభై శాంతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది అని చెప్తున్నారు. ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు కెరిర్ లో రుద్రయ్య అనే టైటిల్ తో హిట్స్ వచ్చాయి. దాంతో రుద్ర అనే టైటిల్ కలిసివస్తుందని భావిస్తున్నారు.
''మనసుల్ని కలిపే వారధి లాంటి యువకుడి కథ ఇది. సున్నితమైన భావోద్వేగాలతో అల్లుకొన్న ఈ కథలో కావల్సినంతగా యాక్షన్ అంశాలుంటాయి. ప్రభాస్‌ని కొత్తగా చూపించబోతున్నాము''అన్నారు నిర్మాతలు. సత్యరాజ్, నదియా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్‌కుమార్ రాజు, ఛాయాగ్రహణం: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
ఈ చిత్రంతో పాటు ప్రభాస్ 'రెబల్'చిత్రం కూడా చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











