ప్రభాస్ ‘వారధి’ రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని ప్రస్తుతానికి 'వారధి' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్వరలో మరో పవర్ ఫుల్ టైలిల్‌ను ప్రకటించనున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తోందిన ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చారు. తాజాగా ఈచిత్ర రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్లో ఆడియో విడుదల చేయనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

ఇక ప్రభాస్-తమన్నా, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'రెబల్' చిత్రం సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలతో జోరుమీదున్న ప్రభాస్ 'రెబల్' చిత్రంతో హాట్రిక్ కొడదామనుకున్నాడు. కానీ లారెన్స్ చేసిన అతి వల్ల సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచలేక పోయింది.

'రెబల్' చిత్రం ప్లాప్ టాక్‌తో చిన్నబోయిన ప్రభాస్ సంక్రాంతి రేసులో పుంజుకుంటాడని, వారధి చిత్రంతో మళ్లీ ప్రభాస్ పుంజుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న కొరటాల శివ ప్రభాస్ అభిమానుల నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X