ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తాడట

By Srikanya

హైదరాబాద్ : ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తాడని తెలుగు సినిమా వర్గాల్లో వినపడుతోంది. ఇంతకీ ఏ సినిమాకు ఆయన వాయిస్ ఇవ్వబోయేది అంటే మహేష్,కొరటాల శివ చిత్రానికి అని చెప్తున్నారు. అయితే ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని ఇప్పటివరకూ ఈ విషయమై ఏ విధమైన సంప్రదింపులు జరగలేదని చెప్తున్నారు. కొరటాల శివకు ప్రభాస్ కు ఉన్న అనుభంధంతో ఇలా వాయిస్ ఓవర్ అడగబోతున్నాడని, ప్రభాస్ కాదనడని అంటున్నారు.

గతంలోనూ మహేష్... జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ... ఎన్టీఆర్..బాద్షా చిత్రం ఇంట్రడక్షన్ కు సైతం వాయిస్ ని ఇచ్చారు. ఇప్పుడు మహేష్ కు మరో హీరో వాయిస్ ఓవర్ తీసుకునే సమయం వచ్చిందన్నమాట. మరి ఈ విషయమై మహేష్ ఏమంటాడో చూడాలి.

Prabhas voice over for Mahesh Babu

'ఆగడు' తరవాత స్వల్ప విరామం తీసుకొన్నాడు మహేష్‌బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అవుతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'మిర్చి' తరవాత ఆయన రూపొందిస్తున్న చిత్రమిదే. శ్రుతి హాసన్‌ హీరోయిన్. ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభిస్తారు.

నవంబరు 3 నుంచి మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొంటారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ''మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయ''నిర్మాతలు చెప్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X