Prabhas vs Salman Khan: ప్రభాస్, సల్మాన్ ఖాన్ పోటాపోటీ.. భారీ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?
భారతీయ సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అంటేనే బాక్సాఫీస్ వద్ద యుద్ధమే అని చెప్పాలి. ముఖ్యంగా పండగ సీజన్లలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే, అది సాధారణ పోటీ కాదు... రికార్డులు బద్దలయ్యే స్థాయి క్లాష్‌గా మారుతుంది. ఇప్పుడు అలాంటి మరో మెగా ఫైట్‌కు రంగం సిద్ధమవుతోందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. 2027 ఈద్ సందర్భంగా రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదల కాబోతున్నట్టు టాక్. బాక్సాఫీస్ వద్ద హిస్టారికల్ క్లాష్ జరుగుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
2027 ఈద్ సందర్భంగా ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. తమ మెగా ప్రాజెక్ట్‌లతో ఒకేసారి బరిలోకి దిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఈద్ సీజన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఆయన నటించిన అనేక చిత్రాలు ఈద్ సందర్భంగా విడుదలై భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్లీ అదే ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తూ, ఆయన కొత్త సినిమాతో రాబోతున్నట్లు సమాచారం.

భారీ సినిమాకు దర్శకత్వం వహించేది వంశీ పైడిపల్లి కాగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకోసం ముంబై గోరేగావ్‌లో భారీ మినీ సిటీ సెట్‌లు వేశారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ గ్రాండియర్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈద్ 2027 రిలీజ్ టార్గెట్‌గా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ (Spirit) ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు 2027 మార్చి 5 విడుదల తేదీని నిర్ణయించారు. అయితే ఈ తేదీ ఈద్ సీజన్‌కు దగ్గరగా ఉండటం వల్ల, లేదా నేరుగా ఈద్‌కు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. బాలీవుడ్‌కు సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద బ్రాండ్ అయితే, పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కూడా అంతే ప్రభావం చూపగలడు. దీనితో నార్త్ vs సౌత్ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరమైన పోటీ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
అయితే ఈ క్లాష్ నిజంగా జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. నిర్మాత దిల్ రాజు గతంలో పెద్ద క్లాష్‌లను ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్, ప్రభాస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పబడుతోంది. అందువల్ల చివరి నిమిషంలో ఒక సినిమా వాయిదా పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇకపై, ఫ్యాన్స్ మాత్రం ఈ క్లాష్ జరిగితేనే బాగుంటుంది. 'ఇద్దరు స్టార్‌లు ఒకేసారి వస్తే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది', 'రికార్డులు బద్దలవుతాయి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications

















