లారెన్స్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్?
లారెన్స్ దర్శకత్వంలో ప్రబాస్ హీరోగా రెబెల్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ ఈ చిత్రం షూటింగ్ ని ప్రక్కన పెట్టి తను నటించి,దర్సకత్వం వహించిన కాంచన చిత్రం ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. కాంచన చిత్రం ఈ నెల 15వ తేదీన రిలీజ్ కావటంతో పూర్తిగా దానిమీద కాన్సర్టేట్ చేసాడు. అంతేగాక ఆ చిత్రంకు సీక్వెల్ తీస్తానని, స్కిప్టు పై చర్చలు జరుపుతున్నాడు. మరోప్రక్క సల్మాన్ తో కాంచన రీమేక్ కు పావులు కదుపుతూ హిందీకి అణుగుణంగా కాంచన స్క్రిప్టులో ఏమేమి మార్పులు చేయాలో అని డిస్కస్ చేస్తున్నాడు. ఇవన్ని చూస్తున్న ప్రభాస్ కి ఎక్కడో కాలుతోందిట. తెలుగులో ఎవరూ అవకాశం ఇవ్వకపోయినా నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తాడా అని మండిపడుతున్నాడట్ట. అంతేగాక లారెన్స్ ని పిలిచి ముందు రెబెల్ పూర్తి చేసి మిగతా విషయాలపై తర్వాత కాన్సర్టేట్ చేయమని సీరియస్ గా వార్నింగ్ తరహాలో చెప్పాట్ట. అదీ విషయం.


Click it and Unblock the Notifications











