ప్రభాస్ పెళ్లికి రంగం సిద్దం.. డిటేల్స్
హైదరాబాద్: హఠాత్తుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రబాస్ వివాహానికి సంభందించిన మాటలు వేడిక్కాయి. రాజమౌళి తో ప్రస్తుతం తాను చేయబోతున్న బాహు బలి చిత్రం దాదాపు రెండున్నర సంవత్సరాలకు పైగా పట్టనుండటంతో పెళ్లికి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పశ్చిమ గోదావరి భీమవరం కి చెందిన చుట్టాల అమ్మాయితో సంభంధం సెటిల్ చేసినట్లు సమాచారం. పెళ్లి వారితో సంప్రదింపులు జరుపుతున్న పెదనాన్న కృష్ణం రాజు ఇప్పటికే పెళ్లి చర్చలు ఓ కొలిక్కి తెచ్చారని తెలుస్తోంది. సినిమా ప్రారంభంలోగానే పెళ్లి కబురు వినపడుతుందని టాక్.
అయితే ప్రభాస్ మాత్రం... నా పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. నేనూ సీరియస్‌గానే ఆలోచిస్తున్నా. 2014లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకోబోయే అమ్మాయి ఉద్యోగం చేసినా ఫర్లేదు, చెయ్యకపోయినా ఫర్లేదు... మంచి అమ్మాయి అయితే చాలు అంటున్నాడు. కాని ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
మరో ప్రక్క ప్రభాస్ హీరోగా...కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిర్చి' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్లో ప్రభాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో భారీగా రీలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











