రెబల్ స్టార్ గానే ఫిక్స్ అయిపోయిన ప్రభాస్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య 'రెబల్ స్టార్"గానే చెలామణి అయిపోతున్నాడు. పెదనాన్న కృష్ణంరాజుకి సినిమాల్లో రెబల్ స్టార్ బిరుదు వుండగా, దాన్ని తన పేరు ముందుకు చేర్చేసుకున్న ప్రభాస్, ఇప్పుడు 'రెబల్" పబ్లిసిటీ స్టార్ గా మారిపోతున్నాడు. విషయమేంటంటే, ఆ మధ్య 'కాంచన" సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ చాలా హడావిడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 'రెబల్" సినిమా లారెన్స్ డైరెక్షన్ లో చేస్తున్నాడు కనుక ప్రభాస్, ఫ్రెండ్ షిప్ కొద్ది 'కాంచన"కి పబ్లిసిటీ చేస్తున్నాడులే అనుకున్నారంతా...
అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ మరో సినిమా పబ్లిసిటీని తన భుజానికెత్తుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 'మిస్టర్ రాస్కెల్" పేరుతో పరుచూరి వారి వారసుడు రవి హీరోగా వస్తోన్న సినిమాని ఆదరించాలంటూ కోరుతున్నాడు ప్రభాస్. మామూలుగా ఇలాంటి ప్రమోషన్ యాడ్స్ లో కన్పించడంలో తప్పేమీ లేదుగానీ, ప్రభాస్ ఎక్కువగా ఈ తరహా ప్రకటనల్లో కన్ఫిస్తుండడమ్మీదే రకరకాల కామెంట్లు వెలువడుతున్నాయి. అదే సమయంలో బేషజాల్లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమంటూ ప్రభాస్ పై ప్రశంసలూ కురుస్తున్నాయనుకోండి..


Click it and Unblock the Notifications











