ఆమెనే రాజమౌళి, ప్రభాస్ సినిమాకి?
మిస్ యూనివర్స్ ఇండియా-2011 సుంకవల్లి వాసుకికి టాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే ఆమెను రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి అడిగినట్లు సమాచారం. ఎందుకంటే ఆమె ఎత్తు ఎక్కువ కావటంతో ప్రబాస్ కి సరైన జోడీగా భావిస్తున్నారు. అయితే ఆమె ఇంకా ఈ విషయమై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వినికిడి. ఇక సుకి సుంకవల్లి ముంబైలో నిర్వహించిన వాద్వా న్ లైఫ్‌స్టైల్ అయామ్ షీ -2011 పోటీ ఫైనల్స్‌లో 17 మంది సుందరాంగులను తలదన్ని టైటిల్‌ను గెలుచుకుంది. ఆమెకు మిస్ యూనివర్స్ ఇండియా-2011 టైటిల్ దక్కింది. వాసుకి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ఉంగుటూరు. ఈ విధంగా తెలుగు వారిని కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు ట్రేడ్ లో వినపిస్తోంది.


Click it and Unblock the Notifications











