దైవాన్ని ఎదిరించే సైతాన్‌గా ప్రభాస్.. నాగ్ అశ్విన్ విజువల్ వండర్?

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా చేసిన తరువాత ప్రతి సినిమా కూడా ఊహించని విధంగా తెరకెక్కుతోంది. సాహో సినిమా అనంతరం ప్రభాస్ వేస్తున్న అడుగులు ఉహాలకందని విధంగా ఉంటున్నాయి. తన 21వ ప్రాజెక్టును మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాపై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

దూరంగా ఉండాలని..

దూరంగా ఉండాలని..

అసలైతే ప్రభాస్ సాహో తరువాత చిన్న బడ్జెట్ లో సినిమాలు చేయాలని అనుకున్నాడు. వీలైనంత వరకు కొన్నాళ్లపాటు 100కోట్ల బడ్జెట్ అనే దానికి దూరంగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా ప్రభాస్ కోసం దర్శకనిర్మాతలు పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులనే తీసుకువస్తున్నారు. నెక్స్ట్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ 21..

ప్రభాస్ 21..

ఇక 21వ ప్రాజెక్టును మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయనున్నాడు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఊహించని కథనాలు వెలువడుతున్నాయి. సోషియో ఫాంటసీ సినిమా, అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ అంటూ రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇంతవరకు చిత్ర యూనిట్ ఆ రూమర్స్ పై పెద్దగా స్పందించింది లేదు.

సైతాన్ షేడ్స్..

సైతాన్ షేడ్స్..

ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ ఒక టాక్ వైరల్ గా మారింది. ప్రభాస్ దైవాన్ని ఎదిరించే ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో కనిపిస్తాడట. అంటే అది పూర్తిగా నెగిటివ్ రోల్ కాదట. రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ పాత్ర ఉంటుందని సమాచారం. ఒక ఎపిసోడ్ లో అతి భయంకరమైన సైతన్ గా కనిపించనున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే ప్రభాస్ ని చాలా కొత్తగా చూడవచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Actor Naresh Starts Dubbing For Jathi Ratnalu movie
విజువల్ వండర్..

విజువల్ వండర్..

ఆ రూమర్స్ సంగతి పక్కనపెడితే.. చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ 21వ ప్రాజెక్టు మాత్రం ఒక విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత సి. అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించనున్నారు. నాగ్ అశ్విన్ మహానటి తరువాత చేస్తున్న సినిమా కావడంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X