ప్రభుదేవా రెండో వివాహంపై రూమర్లు.. అసలు విషయం ఏమిటంటే!

ప్రమఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తమిళ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. కొద్ది సంవత్సరాల క్రితం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు. అయితే తల్లిదండ్రుల బలవంతంతో మరోసారి పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలోను, బాలీవుడ్‌లోను

దక్షిణాదిలోను, బాలీవుడ్‌లోను

దక్షిణాదిలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా పలు రకాల భూమికలను ప్రభుదేవా పోషిస్తున్నారు. గతంలో దక్షిణాదికే పరిమితం అయిన ప్రభుదేవా ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో దంబంగ్ 3 సినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ సల్మాన్ ఖాన్‌తో రాధే చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. అలాగే భగీరా, యంగ్ మంగ్ సంగ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

ప్రభుదేవా మొదటి వివాహం

ప్రభుదేవా మొదటి వివాహం

ఇదిలా ఉండగా, ప్రభుదేవాకు రమాలత్‌తో వివాహం జరిగింది. తన డ్యాన్స్‌ గ్రూపులో సభ్యురాలైన రమాలత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లల సంతానం వీరికి కలిగారు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ నయనతారతో అఫైర్ తర్వాత వారి దాంపత్యంలో విభేదాలు చోటుచేసుకొన్నియ.

నయనతారతో పీకల్లోతు ప్రేమలో

నయనతారతో పీకల్లోతు ప్రేమలో

నయనతారతో ప్రభుదేవా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారు. ప్రభుదేవాతో పెళ్లి కోసం నయనతార నటనకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయతే అనూహ్య పరిస్థితుల్లో వారిద్దరూ విడిపోవడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.

కొద్దికాలంగా సింగిల్‌గానే..

కొద్దికాలంగా సింగిల్‌గానే..

మొదటి భార్యతో విడాకులు, నయనతారతో బ్రేకప్ తర్వాత ప్రభుదేవా సింగిల్‌గానే ఉంటున్నారు. అయితే పెళ్లి, ప్రేమకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం కుటుంబ సభ్యుల సూచన మేరకు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినట్టు సమాచారం.

Recommended Video

Megastar Chiranjeevi Meets Legend Kalatapaswi K Vishwanath
ప్రభుదేవా కుటుంబం బలవంతంతో

ప్రభుదేవా కుటుంబం బలవంతంతో

తాజా మీడియా కథనాల ప్రకారం.. కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకొన్నారు. తమ సమీప బంధువుల కుటుంబంలోని అమ్మాయితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన వివరాలను బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వార్త విస్తృతంగా మీడియాలో ప్రచారం అవుతున్న సమయంలో ప్రభుదేవా నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేక సందేహాలను రేకెత్తిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X