వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్‌తో ప్రేమాయణం.. ప్రభుదేవా రహస్య వివాహాం హాట్ టాపిక్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ హల్చల్ చేస్తున్నాడు. ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వైరల్ కాసాగాయి. నయనతార కోసం మొదటి భార్య రమాలతకు విడాకులు ఇవ్వడం అప్పట్లో సంచలనానికి తెరదీసింది. అయితే అనూహ్యంగా నయన్ ప్రభుదేవా విడిపోయారు. అప్పటి నుంచి ప్రభుదేవా ఒంటరిగానే ఉన్నాడు. నయన్ మాత్రం విఘ్నేశ్ శివన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అయితే ఆశ్చర్యకంగా గత వారం రోజుల నుంచి ప్రభుదేవా రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

అలా విడిపోయారు...
ప్రభుదేవా, రమాలత్‌ని ప్రేమించి 1995లో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నయన్‌తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను వివాహం చేసుకోవడం కోసం రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చాడు. నయన్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో సింగిల్‌గానే ఉంటూ వచ్చాడు.

బంధువుల అమ్మాయితో..
ప్రభుదేవా గత కొన్ని రోజులుగా మేన కోడలు (శోభ) వరుస అయ్యే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు అసలు సంగతి బయటకు వచ్చింది. ప్రభుదేవాకు రెండు నెలల క్రితమే రహస్యంగా వివాహామైందని సమాచారం.

ఫిజియో థెరిపిస్ట్‌తో ప్రేమాయణం..
ప్రభుధేవా బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లో రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో కలిసి చెన్నైలో ఉంటున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఆయనకు అత్యంత సన్నిహితమైన ఓ వ్యక్తి మీడియాతో పంచుకున్నాడు. అయితే దీనిపై ప్రభుదేవా నుంచి గానీ, ఆయన కుటుంబసభ్యుల నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ బయటకు రావడం లేదు.
Recommended Video

అలా ఒక్కటయ్యారు..
ప్రభుదేవా గతంలో వెన్నుముక సమస్యతో బాధపడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బీహార్‌కు చెందిన ఓ లేడీ డాక్టర్ ఫిజియోథెరపీ చేసిందట. అలా వారిద్దరు ప్రేమలో పడ్డారని, . కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











