ప్రభుదేవాకు దగ్గరవుతున్న త్రిష!
చెన్నయ్ చిన్నది త్రిష ఇప్పుడు ప్రభుదేవాకు దగ్గరవుతోంది. వీళ్లిద్దరి మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉన్నప్పటికీ....ఇన్నాళ్లు నయనతార అతని వెంట ఉండటంతో కాస్త దూరంగానే ఉంటున్న అమ్మడు, నయనతార ప్రభుదేవాను వదిలి పెట్టడంతో బాధలో ఉన్న అతన్ని ఓదారుస్తూ క్లోజ్ అవుతోంది. దగ్గరవ్వడం అంటే ఇంకేదో అనుకోవద్దు, కేవలం ఫ్రెండ్షిప్పే అనే సంకేతాలు ఇస్తోంది.
ప్రభుదేవా తన పుట్టిన రోజు వేడుకని ఈ నెల 3న చెన్నైలో తన సన్నిహితుల మధ్య గ్రాండ్ గా జరుపుకున్నాడు. నయనతార మినహా ఈ కార్యక్రమంలో చాలా మంది సినీ తారలు పాల్గొన్నారు. అందరికంటే ఇక్కడ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ప్రభుదేవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ సిద్దార్థ్-త్రిష జంటగా ఎం.ఎస్. రాజు నిర్మించిన చిత్రం 'నువ్వోస్తానంటే నేనొద్దంటానా' చిత్రం నుంచే వీరి మధ్య స్నేహ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుదేవా బర్త్ డే పార్టీ అనంతరం త్రిష తన ట్విట్టర్లో స్పందిస్తూ...'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!' నా కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ చిత్రం అది. అలాంటి చిత్రాన్ని తెలుగులో నాకు ప్రభుదేవా అందించాడు. ఆయన అందించిన ఆ విజయాన్ని, ఆయనను జీవితంలో మర్చిపోలేను' అంటూ ట్విట్ చేసింది.
అంతటితో ఆగకుండా ప్రభుదేవాతో క్లోజ్‌గా దిగిన ఫోటోను ఒకదాన్ని తన ట్విట్లర్లో పోస్టు చేసింది. గతంలో త్రిష, నయనతార మధ్య బీభత్సమైన పోటీ వతావరణం ఉండేది. అనేక సందర్భాల్లో త్రిష చేతిదాకా వచ్చిన ఆఫర్లను నయనతార చివరి నిమిషంలో తన్నకుపోయింది. ఈ నేపత్యంలో నయనతార ప్రభుకు దూరం కాగానే త్రిష అతనికి క్లోజ్ అవ్వడం చూస్తుంటే....నయనతారను త్రిష టీజ్ చేయడానికే ఇలా చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











