అది చూస్తేనే రిలాక్స్ అవుతాడ!
సినిమా ఇండస్ట్రీలోని నటీ నటులను ఇటర్యూలోనో, ఏదైనా సందర్భాలలోనో ఇటు మీడియా అటు అభిమానులు వివిధ ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూవుంటారు. ఫ్రీ టైంలో ఏం చేస్తారు అంటే సినిమాలు చూస్తామనో, పుస్తకాలు చదువుతామనో, టీవీ చూస్తామనో, మ్యూజిక్ వింటామనో, క్రికెట్ ఆడతామనో చెబుతుంటారు. కానీ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ప్రభుదేవానదీ మాత్రం విచిత్రమైన హాబీ. రిలాక్స్ కోసం రెస్టారెంట్ కు వెళ్తున్న జనాలున్నారు. ఈయనగారు మాత్రం రిలాక్స్ కోసం హర్రర్ చిత్రాలు చూస్తుంటారట! ఈ విషయాన్ని ప్రభుదేవానే చెప్పారు. ఒక వేళ మ్యూజిక్ విందామనుకుంటే కాళ్లూ చేతులూ తెగ ఆడేస్తాయి. మళ్లీ ప్రొఫెషన్ గుర్తుకొస్తుందట! ఇదేం విచిత్రం అనుకున్నాడేమో! హ్యాపీగా, హయిగా హార్రర్, థ్రిల్లర్ మూవీస్ చూస్తూ భయపడుతూ రిలాక్స్ అవుతాడట! మరి ఇలాంటి చిత్రాలు చూస్తే నిద్ర ఎలా పడుతోందో? నిద్ర పట్టడం కోసం ఏం చేస్తాడో అది కూడా వివరిస్తే బాగుండేది.


Click it and Unblock the Notifications











