»   » ప్రభుదేవా దర్శకత్వంలో కమల్ హాసన్?

ప్రభుదేవా దర్శకత్వంలో కమల్ హాసన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుదేవా దర్శకుడిగా సూపర్ ఛాన్స్ దక్కించుకునట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ తర్వాతి సినిమాకు అతనే దర్శకత్వం వహించబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వాసన్ విజువల్ వెంచర్స్ ఈ మేరకు ఇద్దరి కాంబినేషన్ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ స్క్రిప్టు అప్రూవ్ చేస్తే సినిమా పట్టాలుక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కమల్ హాసన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇంకా తేలలేదు.

Prabhu Deva to direct Kamal Haaan's next?

గతంలో పలు సందర్భాల్లో...తన మనసులోని మాటను ప్రభుదేవా బయట పెడుతూ కమల్ సార్ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని వ్యాఖ్యానించారు. గతంతో ఈ ఇద్దరూ స్టార్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఇపుడు అతని సినిమాకే దర్శకత్వం వహించే అవకాశం వస్తుండటంతో ప్రభుదేవా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయ్యే వరకు ఆయన ఇతర ప్రాజెక్టుల స్క్రిప్టులు వినడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన చివరి బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్షన్ బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలను ఇచ్చింది.

English summary
If the latest reports from the Tamil film circles are to be believed, choreographer turned director Prabhu Deva may direct Kamal Haasan’s next film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu