పవన్-క్రిష్ ప్రాజెక్ట్.. ప్యాన్ ఇండియాగా, హీరోయిన్ ఫిక్స్.. అదిరిపోయే అప్‌డేట్స్
పవన్ కళ్యాణ్ వెండితెరపై విజృంభించేందుకు రెడీ అయ్యాడు. ఓ వైపు పింక్ రీమేక్ అంటూ షూటింగ్ మొదలుపెట్టగా మరోవైపు ఓ పీరియాడిక్ డ్రామాను కూడా లైన్‌లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కే బోయే చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓసారి చూద్దాం.

ఏ ఎమ్ రత్నం నిర్మాతగా..
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఖుషీ సినిమాను నిర్మించిన ఏ ఎమ్ రత్నంతో కలిసి ఈ పీరియాడిక్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఈ సినిమాను చేస్తున్నాడని సమాచారం.

ప్యాన్ ఇండియా..
బాహుబలి చిత్రాల తరువాత టాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియా చిత్రాలు వరుసగా వస్తున్నాయి. సైరా, సాహో చిత్రాలు ఆ క్రమంలో వచ్చినవే. తాజాగా పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని కూడా జాతీయ స్థాయిలో దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోన్నాడని తెలుస్తోంది.

హీరోయిన్ కూడా ఫిక్స్
ఈ మూవీ పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేశారని టాక్. క్రిష్ దర్శకత్వంలో వచ్చి కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ అదే క్రిష్ సినిమాలో పవన్ పక్కన నటించబోతోన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Recommended Video

జనవరి 27 నుంచి షూటింగ్..
ఈ వారంలో పింక్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నుంచి క్రిష్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ సోమవారం (జనవరి 27) నుంచి ప్రారంభం కాబోతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











