విమర్శల కారణంగా వెనక్కి తగ్గిన బాలయ్య: కూతురిలాంటిది అనడంతో నిర్ణయాన్ని మార్చేశాడు!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ దూసుకుపోతున్నాడు. కెరీర్ పరంగా ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో.. పర్సనల్ వ్యవహారాల్లోనూ అదే విధంగా వ్యవహరిస్తుంటాడు బాలయ్య. అందుకోసమే తాజాగా ఓ విషయంలో ఆయన వెనుకడుగు వేశారని తెలిసింది. ఆ వివరాలు మీకోసం.!

క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు
సినీ రంగంలో ఎంతో మంది దర్శకులు, హీరోలు సినిమాలు చేస్తుంటారు. వారిలో కొందరికి మాత్రమే సెట్ అవడంతో పాటు సక్సెస్ వస్తుంటుంది. అలాంటి వాటిలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడీ జంట కలయికలోనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

హ్యాట్రిక్ హిట్ కోసం ఎన్నో జాగ్రత్తలు
వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సమయంలో బాలయ్యకు ‘సింహా' వంటి హిట్‌ను ఇచ్చిన బోయపాటి.. ఆ వెంటనే ‘లెజెండ్'తో మరో విజయాన్ని అందించారు. దీంతో విజయవంతమైన జంటగా నిలిచారు ఈ ఇద్దరు. రెండు భారీ విజయాల తర్వాత రాబోతున్న ఈ చిత్రం కూడా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. దీనికి BB3 అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.

మూవీ కోసం విలన్‌గా మారిన హీరో
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో విలన్‌గా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అంచనాలు పెరిగిపోయాయి.

ఆ విషయంలో క్లారిటీ రావడం లేదు
ఈ చిత్ర కాస్టింగ్ విషయంలో ఎన్నో పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ, హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతోంది. కానీ, స్టార్ హీరోయిన్లతో సైతం చర్చలు జరుపుతున్నాడు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను.

కూతురి వయసున్న అమ్మాయితో
ఇక, ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ ఆర్య సతీమణి సాయేషా సైగల్‌ను ఈ మూవీ కోసం ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. దీంతో బాలయ్యపై విమర్శలు చెలరేగాయి. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేయడం ఏంటని ఆయనను తెగ ట్రోల్ చేశారు కొందరు నెటిజన్లు.
Recommended Video

విమర్శల కారణంగా వెనక్కి తగ్గారు
హీరోయిన్ సాయేషా విషయంలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆమె స్థానంలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీను ఆమె చర్చలు కూడా జరిపారని ఇండస్ట్రీలో న్యూస్ హల్‌చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











