ప్రకాష్ రాజ్-దిల్ రాజు మధ్య ఎందుకు చెడింది?
నిర్మాత దిల్ రాజు, ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తీసే ఏ సినిమాలో అయినా ప్రకాష్ రాజ్ తప్పకుండా ఉండాల్సిందే. విలన్ పాత్రలతో రాణిస్తున్న ప్రకాష్ రాజ్..దిల్ రాజు నిర్మించిన 'బొమ్మరిల్లు' చిత్రం ద్వారా తండ్రి పాత్రలో పరిచయం అయి మరింత పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజ-ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో కూడా వెంకటేష్, మహేష్ బాబు తండ్రి పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపికయ్యారు. అయితే తొలుత పాత్ర చేయడానికి ఒప్పుకున్న ప్రకాష్ రాజ్ ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దిల్ రాజు ఆ పాత్రకు వేరే వారిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉండటంతో ఈ వార్త కన్ ఫర్మ్ అయింది.
అయితే ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు అనేది ఇంతవరకు ఎవరికీ అంతు పట్టడం లేదు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజుకు, ప్రకాష్ రాజుకు మధ్య విబేధాలు వచ్చాయని, ఇద్దరూ ఇక విడిపోయినట్లే అని, ఇప్పట్లో కలిసే అవకాశం లేదని అంటున్నారు. వెంకటేష్, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల వద్ద డేట్స్ తీసుకున్నాక ప్రకాష్ రాజ్ షూటింగుకు రాకుండా ఇబ్బంది పెట్టడమే ఇందుకు కారణమని, మాట మాట పెరిగి గొడవ పెద్దది అయిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య క్లాష్ వచ్చిందని అంటున్నారు. మరి ఈ ఇద్దరు కలిసేది ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











