'ఆగడు' లో ప్రకాష్ రాజ్ తొలిసారిగా...

By Srikanya

హైదరాబాద్ : 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉండనుందని సమాచారం. ఇందులో తొలిసారిగా ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ రెండు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు పాత్రలు మధ్యా వైవిధ్యం చూపెడుతూ శ్రీనువైట్ల స్క్రిప్టుని రూపొందించాడని,సినిమా హైలెట్స్ లో ఇది ఒకటి అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం కృష్ణ జన్మదినం(మే 31) సందర్భంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ''సినిమాలో అసలు సిసలు మాస్‌ మహేష్‌ని చూస్తారు. దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు'' అని నిర్మాతలు తెలిపారు.

Prakash Raj dual in Aagadu

మహేష్‌ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X