శోభారాణితో ప్రకాష్ రాజ్ పెళ్ళి?
మహిళా రాజ్యం అధ్యక్ష్యురాలు శోభారాణి రీసెంట్ గా చెన్నైలో క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ పెళ్లాడిందని గుసగుసలు వినపడుతున్నాయి. ఇందులో నిజమెంత అనేదానికన్నా వీరి మద్య ఎప్పుడు రిలేషన్ డవలప్ అయిందన్నదానిపైనే అందరూ ఆలోచనలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా ఈ వార్త అంతటా వినపడుతోంది. అయితే ప్రజారాజ్యంలో ఉంటూ శోభారాణి ఈ పని ఎలా చేస్తుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కు,చిరంజీవికి ఉన్న గ్యాప్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే మరొక అడుగు ముందుకేసి మొన్న బోనాల్లో శోభారాణి ఆనందంతో చిందయ్యటానికి కారణం ఇదే అని తేల్చేస్తున్నారు.ఇక ప్రకాష్ రాజ్ ఈ మధ్యనే డైవర్స్ తీసుకున్నాడు. అయితే శోభారాణి తన భర్తతో విడాకులు మంజూరు అయ్యాయో లేదో తెలియదు. ఆ మధ్య ఓ రెండుసార్లు శోభారాణి తన భర్తపై ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే లాయరు అయిన శోభారాణికి సెక్షన్ లు చట్టాలు తెలుసుకాబట్టి ఏ విధంగానయినా లీగల్ గా ముందుకెళ్తుందంటున్నారు. ఏదైమైనా మరికొద్దిరోజులు ఆగితే గానీ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ పెళ్ళి వార్తను కన్ఫర్మ్ చేయటం కష్టమే.


Click it and Unblock the Notifications











