పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్దిగా ప్రకాష్ రాజ్
పూరీ జగన్నాధ్ బద్రీలో ప్రకాష్ రాజ్,పవన్ కళ్యాణ్ ఇద్దరూ పోటా పోటీగా ..నందా..నందా..నందా అంటే...నువ్వు నందావైతే నేను బద్రీ..బద్రీనాధ్ అంటూ చెప్పిన డైలాగులు ఎవరూ మర్చిపోరు. మళ్లీ వీరిద్దరూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని సమాచారం. ప్రత్యేకమైన మ్యానరిజంతో ప్రకాష్ రాజ్ పాత్రను తీర్చిదిద్దాడని,అది విన్న ప్రకాష్ రాజ్ వెంటనే ఓకే చేసాడని చెప్తున్నారు.
స్క్రిప్టు విన్న ప్రకాష్ రాజ్...ఈ మధ్య కాలంలో నేను విన్న స్క్రిప్టులో బెస్ట్ స్క్రిప్టు ఇది..చాలా నిజాయితీగా ఉంది. నా కెరీర్ లో మరో పేరు తెచ్చి పెట్టే పాత్ర అవుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పూరీ చెప్పారు.
పూరీజగన్నాథ్ మాట్లాడుతూ- పవన్ తాను కలిసి చేసిన 'బద్రి' తర్వాత మళ్లీ ఓ చిత్రం చేయాలని అనేకసార్లు ప్రయత్నించినా కుదరలేదని, తన 25వ చిత్రంగా మళ్లీ పవన్‌తో చేయడం ఆనందంగా వుందని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్టర్ కథ ఇదని, మే రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ 18న విడుదల చేయనున్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలు వుండే డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇదని ఆయన వివరించారు.
నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ- ఇది ఓ సెనే్సషనల్ చిత్రం అవుతుందని, పూరీ, పవన్‌కళ్యాణ్ కలయికలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతుందని, ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.


Click it and Unblock the Notifications











