మహేష్ బాబు సినిమాలో శ్రీహరిని తొలిగించి...
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో కథలో కీలకమైన పాత్రకు శ్రీహరి ని మొదట అనుకున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ కూడా జరిగాయి. ఢీ, కింగ్, చిత్రాల్లో శ్రీహరికి ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చిన శ్రీనువైట్ల ఈ సారి కూడా అటువంటి ఓ గమ్మత్తైన పాత్ర తయారు చేసాడని చెప్పుకున్నారు. అయితే అనుకోని విధంగా సీన్ లోకి ప్రకాష్ రాజ్ వచ్చాడు. శ్రీహరిని తొలిగించి ప్రకాష్ రాజ్ ని ఆ పాత్రలోకి పెట్టారు. అంతేగాక ఆ పాత్ర ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగల టైలర్ మేడ్ రోల్ అని చెప్తున్నారు. అయితే ఇదంతా మహేష్ మహత్యమని కొందరంటున్నారు. శ్రీహరి వైపుకే శ్రీను వైట్ల మ్రొగ్గుచూపినా ప్రకాష్ రాజ్ కావాలని మహేష్ పట్టుపట్టాడని చెప్పుకుంటున్నారు. ఇక ఆగస్టు మూడవ వారం నుంచి మొదలయ్యే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించే ఈ చిత్రంకి దూకుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్ పై శ్రీను వైట్ల..నమో వెంకటేశ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











