అక్కడ కూడా ప్రస్థానం మొదలెట్టేశాడు ‘వీడు సామాన్యుడు కాదు’..!
సౌత్ మసాలా పై విపరీతమైన మక్కువ పెంచుకున్న బాలీవుడ్ ఇప్పుడు అదే పనిగా ఇక్కడి చిత్రాలని అక్కడికి పట్టుకుపోయి కోట్లకి కోట్లు గడిస్తున్న సంగతి తెలసిందే. సినిమా రైట్స్ తో పాటు ఇక్కడి టాప్ హీరోయిన్లని సైతం వలేసి పట్టేస్తున్న అక్కడి హీరోలు మన దర్శకులనీ వదలడం లేదు. కథలు, కథనాయికలు, దర్శకులతో పాటు నార్త్ వాళ్లు ఇష్టపడుతోన్న మరో వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రకాష్ రాజ్ ఒక్కడే.
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా చేసిన ప్రతి పాత్రకీ జీవం పోసిన ప్రకాష్ రాజ్ కి పలు భాషలు తెలుసు. హిందీ, మరాఠీ అనర్గళంగా మాట్లాడగల ప్రకాష్ రాజ్ బాలీవుడ్ లో ఏనాడో అంతరించిపోయిన రియల్ విలన్ ని మళ్ళీ బతికిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'వాంటెడ్"లోప్రతినాయికుడి పాత్ర పోషించారు, అజయ్ దేవగన్ 'సింగం" లో, పూరి-అమితాల 'బుడ్డా" లో ప్రకాష్ రాజ్ నటనకి బాలీవుడ్ దాసోహమయింది. అందుకే ప్రకాష్ రాజ్ తో సినిమాలు చేయడానికి ఇంకా చాలా మంది వెంట పడుతున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ మరియు షారుఖ్ తమ నెక్స్ట్ ఫిల్మ్స్ లో ప్రకాష్ రాజ్ కి చాన్సిచ్చారు. ఈ మధ్య కాలం లో సల్మాన్ వరుసగా సౌత్ సినిమాల రీమేక్ లే చేస్తున్నాడు. దాంతో పాటుగా సౌత్ యాక్టర్స్ కి కూడా బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి.
ఎంతో మందికి వాంటెడ్ లిస్ట్ లో చేరిన ప్రకాష్ రాజ్ త్వరలో ప్రస్థానం హిందీ రీమేక్ లోనూ నటిస్తున్నాడు. షారుక్, అమీర్ ఖాన్ ల తదుపరి చిత్రాల్లోనూ ప్రకాష్ రాజ్ కి అవకాశమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ హీరోగా 'వీడు సామాన్యుడు కాదు" అనే సినిమా తెరకెక్కింది. ఇప్పుడు బాలీవుడ్ అతనికి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఆ టైటిలే గుర్తొస్తోంది.


Click it and Unblock the Notifications











